Salaar Trailer Effect: ట్రెండింగ్ లో ఉగ్రమ్… కారణం ప్రభాస్-ప్రశాంత్ నీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఉగ్రమ్ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రశాంత్ నీల్ మొదటి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ మురళి హీరోగా నటించాడు. ఇద్దరు స్నేహితుల కథగా 2014లో రిలీజ్ అయిన ఉగ్రమ్ సినిమాలో కన్నడగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సేషన్ గా మారాడు. సలార్ సినిమాకి ఉగ్రమ్ సినిమాకి పోలికలు ఉంటాయనే కామెంట్స్ చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఇటీవలే రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ బయటకి వచ్చిన తర్వాత ఆ డిస్కషన్ మరింత పెరిగింది. సలార్, ఉగ్రమ్ సినిమాకి రీమేక్ వర్షన్… స్కేల్ పెంచి అదే కథని పాన్ ఇండియా రేంజులో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్ అనే కామెంట్స్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో కూడా ఇది ఇద్దరు స్నేహితుల కథగా ప్రెజెంట్ చేయడంతో సలార్ రీమేక్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు.
ఈ కారణంగానే కన్నడ మూవీ లవర్స్, ఉగ్రమ్ మూవీ లవర్స్, శ్రీ మురళి ఫ్యాన్స్ ఉగ్రమ్ ట్యాగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ అంత బ్లైండ్ గా ఉగ్రమ్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ తో తెరకెక్కించకపోవచ్చు. ఉగ్రమ్ అనేది ప్రశాంత్ నీల్ మొదటి సినిమా కాబట్టి అతను ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఉగ్రమ్ లైన్స్ లో, ఆ ఛాయలు కనిపించడం సహజం. సందీప్ రెడ్డి వంగ ఎన్ని సినిమాలు చేసినా కూడా అర్జున్ రెడ్డి లైన్స్ ఛాయలు తప్పకుండా కనిపిస్తాయి. నీల్ విషయంలో కూడా అంతే… ఉగ్రమ్ ఛాయలు ఉంటూనే సలార్ కొత్త ప్రపంచంలో డిజైన్ చేసిన సినిమా అవుతుంది.
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!