NTV Telugu Site icon

Salaar Overseas: 4 మిలియన్స్… ఈ రికార్డ్ టచ్ చేసే వాళ్లు ఉన్నారా? మళ్లీ ప్రభాస్ యే బ్రేక్ చేయాలా?

Salaar Overseas

Salaar Overseas

బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు ప్రభాస్. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం 170-180 కోట్ల వరల్డ్ వైడ్ ఓపెనింగ్ ని సలార్ రాబట్టిందని టాక్. ఫైనల్ రిపోర్ట్స్ హోంబలే ఫిల్మ్స్ నుంచి ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ అఫీషియల్ గా బయటకి రాలేదు కానీ ఓవర్సీస్ రిపోర్ట్ మాత్రం వచ్చేసింది. నార్త్ అమెరికాలో సలార్ సినిమా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది.

Read Also: Megastar Tweet: మై డియర్ దేవా… బాక్సాఫీస్ కి సెగలు పుట్టించావ్ కంగ్రాట్స్

ప్రీమియర్స్, డే 1 కలిపి ఇప్పటివరకూ సలార్ సినిమా 3.8 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి 4 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. ఈరోజు ఎండ్ అయ్యే లోపు సలార్ సినిమా 4.5 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉండే అవకాశం ఉంది. నార్త్ అమెరికాలో సలార్ సినిమా ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేసింది. సాలిడ్ నంబర్ ఆఫ్ షోస్ సలార్ సినిమాకి దక్కేలా చేసిన ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో హోంబలే ఫిల్మ్స్ కన్నా యాక్టివ్ గా ఉండి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నారు. బుల్డోజర్ బాక్సాఫీస్ ని దున్నేస్తుంది అంటూ ట్వీట్స్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ ప్రభాస్ కి నాన్ స్టాప్ ఎలివేషన్స్ ఇస్తూనే ఉన్నారు.

Read Also: Salaar Dunki: “ఖాన్…సార్” అడ్డాలో ఎగిరిన డైనోసర్ జెండా

Show comments