NTV Telugu Site icon

Salaar Overseas: 2 మిలియన్ డాలర్స్ ప్రీసేల్స్… ఆగ్ లగా దియా

Salaar B

Salaar B

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేసిన మొదటి సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడి మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. తెలుగు రాష్ట్రాలకి పూనకాలు తెప్పించడానికి ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. బాహుబలి మీట్స్ KGF అన్నట్లు… ఒక పెద్ద విధ్వాంసం బాక్సాఫీస్ దగ్గర జరగబోతుంది. ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సలార్ సెన్సేషనల్ బుకింగ్స్ ని రాబడుతోంది. ముఖ్యంగా యుఎస్ఏ మార్కెట్ లో సలార్ ర్యాంపేజ్ జరుగుతోంది. అక్కడ సలార్ సినిమాని ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్చేస్తోంది. లియో లాంటి భారీ బడ్జట్ సినిమాలని డిస్ట్రీబ్యూట్ చేసిన ప్రత్యంగిరా సినిమా సలార్ కోసం హ్యూజ్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ని బ్లాక్ చేసింది.

ఇప్పటికే సలార్ సినిమా 2500 స్క్రీన్స్ లో ప్రీమియర్ అవ్వడానికి రెడీగా ఉంది. ఆక్వామెన్ 2 కన్నా కొన్ని చోట్ల సలార్ సినిమాకే ఎక్కువ స్క్రీన్స్ దక్కాయి అంటే ప్రత్యంగిరా ఏ రేంజ్ డిస్ట్రీబ్యూషన్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ థియేటర్స్ బుకింగ్స్ సలార్ సినిమాపై ఎంత బజ్ ఉంది అనేది నిరూపిస్తోంది. కేవలం ప్రీసేల్స్ తోనే సలార్ సినిమా 2 మిలియన్ డాలర్స్ ని టచ్ చెయ్యడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు 1.81 మిలియన్ డాలర్ మార్క్ ని రీచ్ అయిన సలార్ సినిమా 70 వేల టికెట్స్ ని సోల్డ్ చేసింది. 2023లో రిలీజైన ఏ లాంగ్వేజ్ సినిమాకైనా ఇది రికార్డ్. ప్రీమియర్స్ పడడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి 1.81 నుంచి ప్రీసేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రీమియర్స్ అండ్ డే 1 కలిపితే సలార్ రికార్డ్ మేకింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టడం గ్యారెంటీ.

Show comments