Site icon NTV Telugu

Salaar: సలార్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Salaar Release Date

Salaar Release Date

Salaar Makers Gives Clarity On Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన భారీ బడ్జెట్ సినిమాల్లో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌తో తెరకెక్కుతుండటంతో.. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. ఈ సినిమా వాయిదా పడొచ్చన్న పుకార్లు పుట్టుకొచ్చాయి. ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయని, వీఎఫ్ఎక్స్ వర్క్‌కి ఇంకా సమయం కావాలని, తద్వారా ఈ సినిమా చెప్పిన తేదీకి రాకపోవచ్చని ఓ ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తమ సినిమాను వాయిదా వేయడం లేదని సలార్ యూనిట్ సభ్యులు స్పష్టతనిచ్చారు. ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 28వ తేదీనే తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని కన్ఫమ్ చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని, ఆ పనుల్లో ఎలాంటి జాప్యం లేదని వెల్లడించారు. కాబట్టి.. సినిమా వాయిదా పాడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Honey Rose : అందాలతో మత్తెక్కిస్తున్న మలయాళం కుట్టి

కాగా.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో శృతి ఒక రిపోర్టర్‌గా కనిపించనుంది. ఆమెతో పాటు మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అతనికి, ప్రభాస్‌కి మధ్య ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండనున్నాయని వార్తలొస్తున్నాయి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ సినిమా రిలీజ్ అయ్యాక సలార్‌పై పూర్తి దృష్టి సారించనున్నాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.

Karnataka: లోపల కాంగ్రెస్ మీటింగ్.. బయట ఫైటింగ్.. బెంగళూర్‌లో టెన్షన్

Exit mobile version