Salaar: సలార్ అప్డేట్.. డైనోసర్ రాక ఎప్పుడో తెలిసిపోయింది.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పోతేపోయింది. ఎలాగూ.. మనకు కావాల్సిన యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ వస్తుందిగా అని లైట్ తీసుకున్నారు. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటే.. మాములు విషయం కాదు. ఇక ఈ సినిమా ఎప్పడైతే అనౌన్స్ అయ్యిందో.. అప్పటినుంచి రిలీజ్ ఎప్పుడు.. రిలీజ్ ఎప్పుడు అని అభిమానులు కాచుకొని కూర్చున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ఎన్ని రికార్డులు ఉంటే అన్ని రికార్డులను తిరగరాశాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక మొదట నుంచి సలార్ 2023 లోనే రిలీజ్ అవుతుంది అని చెప్తూనే వస్తున్నారు.
Dil Raju: స్కందకి చంద్రముఖి 2 షాక్.. దిల్ రాజు ఇప్పుడు ఏం చేస్తాడు?
Also Read
మొదట ఏప్రిల్ అన్నారు.. అది పోయింది.. సరే సెప్టెంబర్ లో వస్తుంది అని చెప్పారుగా.. పర్లేదు ఎదురుచూద్దాం అని అనుకుంటే.. గతకొన్నిరోజుల నుంచి ఈసారి కూడా సలార్ వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలు అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇక ఈ వాయిదాలు అలవాటు పడ్డ డార్లింగ్ ఫ్యాన్స్ గుండెలను దిటవు చేసుకొని కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది వచ్చేలా చూడు దేవుడా అని కోరుకుంటున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. సలార్ ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలుస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ లోనే సలార్ ను రిలీజ్ చేయనున్నామని మేకర్స్.. డిస్ట్రిబ్యూటర్స్ తో తెలిపినట్లు టాక్ నడుస్తోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. హమ్మయ్య డైనోసర్ రాక ఈ ఏడాదే అని సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?