Site icon NTV Telugu

బిగ్ బాస్ విన్నర్ సన్నీ కొత్త సినిమా.. సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ క్రిష్

vj sunny

vj sunny

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజె సన్నీ, అషిమా నార్వేల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సకల గుణాభిరామ’. శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించారు మేకర్స్. అంతేకాకుండా సన్నీ నిన్ననే బిగ్ బాస్ నుంచి బయటికి రావడంతో తమ హీరోకి ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేసి స్వాగతం పలికారు చిత్ర బృందం.

https://ntvtelugu.com/urfi-javeds-designer-gets-trolled/

తాజాగా డైరెక్టర్ క్రిష్ తన ట్విట్టర్ వేదికగా ఈ సాంగ్ ని రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏ పొరపాటో అంటూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. విజువల్స్ చూస్తుంటే ఈ సాంగ్ సాడ్ సాంగ్ లా కనిపిస్తోంది. అనుదీప్ సంగీత దర్శకత్వంలో సింగర్ ప్రదీప్ పాడిన ఈ పాట ఆద్యంతం మనసును హత్తుకొంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కనుడ్ని. మరి బిగ్ బాస్ విన్నర్ గా గెలిచినా సన్నీ మొదటి సినిమాతోనే హీరోగా విజయం సాధిస్తాడా ..? లేదా ..? అనేది చూడాలి.

Exit mobile version