NTV Telugu Site icon

Sailesh Kolanu: బుల్లెట్ షాట్ ట్రోలింగ్… క్లారిటీ ఇచ్చిన శైలేష్ కొలను

Bullet Shot Trolling

Bullet Shot Trolling

Sailesh Kolanu on Bullet shot trolling: మన సినీ దర్శకులు తీసే కొన్ని షాట్స్, సీన్స్ ఆలోచింప చేసేలా ఉంటే కొన్ని మాత్రం ఇదేంట్రా ఇలా చేశాడు అనిపించిలా ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా నటించిన ‘సైంధవ్’ మూవీలో ఒక షాట్ విషయంలో ట్రోలింగ్‌ జరుగుతోంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలకాగా ఈ ట్రైలర్‌లోని ఒక సీన్‌లో హీరో గన్ పేల్చే షాట్ ఉంది. వెంకటేష్ సైకోగా, నేలపై మోకాళ్లపై కూర్చున్న రౌడీ నోటిలోకి తుపాకీని కాల్చగా బుల్లెట్ అతని శరీరంలోకి గుచ్చుకుని మలద్వారం నుంచి బయటకు వెళ్లినట్టు చూపారు. దీంతో నెటిజన్లు ఈ విషయంలో ట్రోల్ చేశారు. దీనిపై దర్శకుడు శైలేష్ కొలను స్పందిస్తూ, ఈ మీమ్ తనకు ఫన్నీగా అనిపించిందని,. అయితే, ఇది సిద్ధాంతపరంగా సాధ్యమే కానీ ఆచరణాత్మకంగా ఉండకపోవచ్చని ఆయన అంగీకరించారు.

Game On: రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ ‘గేమ్‌ ఆన్’

తర్వాత బులెట్ అసలు అలా ఎలా బయటకు వచ్చింది అని వివరించాడు. మామూలుగా బుల్లెట్ నోట్లో కాలిస్తే.. తల నుంచి బయటకు రావాలి, కానీ తను వేసిన లెక్కల ప్రకారం నోట్లో 80 డిగ్రీలలో గన్ పెట్టి కాలిస్తే అలా వెనుక నుండి బయటికి వస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా దాని గురించి వివరిస్తూ ఒక పెద్ద బయాలజీ ఆన్సర్‌ను ట్వీట్ చేయడంతో .అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైంధవ్’.. జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ముఖేష్ రిషీ, నవాజుద్దీన్ సిద్ధికీ, ఆర్య కనిపించనున్నారు. రుహానీ శర్మ, ఆండ్రియాలాంటి హీరోయిన్లు కూడా ‘సైంధవ్’లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.