Site icon NTV Telugu

జలకాలాడుతూ చిన్నపిల్లలా మారిపోయిన ‘ఫిదా’ బ్యూటీ

sai pallavi

sai pallavi

శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది సాయి పల్లవి. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎక్స్ పోజింగ్ కి దూరంగా.. అభినయానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకొంటూ ఉంటుంది. సినిమాలోనే కాకుండా బయట కూడా ఒక సాధారణ అమ్మాయిలా ఉండడమే తనకిష్టమని చెప్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ఫోటోషూట్స్ కూడా అలాగే ఉంటాయి.

తాజాగా సాయి పల్లవి కొత్త ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పూల పూల కుర్తాలో స్విమ్మింగ్ పూల్ వద్ద ఆడుకుంటూ కనిపించింది. చిన్నపిల్లలా నీటితో ఆడుకొంటూ చిరునవ్వులు చిందిస్తున్న సాయి పల్లవిని చూస్తుంటే ప్యూర్ సోల్ అంటే ఇదేనేమో అనిపిస్తూ ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ఫోటోలను ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం విశేషం. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో దేవదాసి పాత్రకు నీరజ కోననే కాస్ట్యూమ్స్ అందించిన విషయం తెలిసిందే.

https://www.instagram.com/p/CYIu0mBLz5m/

Exit mobile version