NTV Telugu Site icon

Sai Pallavi: డైరెక్టర్ సీక్రెట్స్ లీక్ చేసిన సాయి పల్లవి.. పాపం ఆడేసుకుందిగా!

Sai

Sai

తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ చందు మొండేటి సీక్రెట్స్ అన్ని బయటపెట్టింది హీరోయిన్ సాయి పల్లవి. ముందుగా ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు యాంకర్ సుమ డైరెక్టర్ పాత ఫోటోతో పాటు ప్రస్తుత ఫోటో స్క్రీన్ మీద వేయించి చూపించింది. క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెంచారు కదా అంటూ ఉంటే మైక్ అందుకున్న సాయి పల్లవి నెక్స్ట్ హీరోగా ట్రై చేస్తున్నాడు అందుకే జుట్టు పెంచాడని చెప్పుకొచ్చింది. దానికి సాయి పల్లవికి చందు కౌంటర్ ఇచ్చాడు. మీకు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేయాలనే ఉంది కదా నన్ను పెట్టుకుంటారా అని అడిగితే అది నిజం కాదని ఆయన ఊరికే అంటున్నాడని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. కావాలంటే ఎవరినైనా అడగండి షూట్ లో చందు రోజుకి రెండు జతలు మార్చుకునేవాడు. అతనికి చెమట పడితే నచ్చదని, రెండు రెండు షర్ట్స్ మార్చుకునేవాడు. మేము చూస్తే ఎండలో చేపలాగా పడుంటాము, ఆయన మాత్రం కొత్త కొత్త బట్టలు వేసుకుని ఒక ఫ్యాన్ పెట్టుకుని ఒక గొడుగు పెట్టుకుని ఉండేవాడు అని చెప్పింది సాయి పల్లవి.

Ramayana: పార్లమెంటులో ‘రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శన

తర్వాత సాయి పల్లవి ఫుడ్ గురించి ప్రస్తావన రాగా ఆమె రోజుకు ఐదు లీటర్ల కొబ్బరి నీళ్లు తాగుతుందని నాగచైతన్య అన్నారు. ఐదు లీటర్లు తాగను రెండు మూడు లీటర్లు తాగుతానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. దానికి చందు కూడా కల్పించుకుని ఐదు లీటర్లు ఈజీగా తాగేస్తుందని చెప్పుకొచ్చాడు. మరి మీరేం తాగుతారని సుమ అడిగితే వెంటనే తనకు మంచినీళ్లు కూడా ఇవ్వరని అన్నాడు. వెంటనే సాయి పల్లవి మైక్ తీసుకుని అదేమీ లేదు అక్కడ మంచిగా ఒక ప్రోటీన్ షేక్ వస్తుంది, హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ తింటాడు హైడ్రేటెడ్ గా ఉంటాడు. సన్ స్క్రీన్ రాసుకుంటాడు. రెండు గంటలకు ఒకసారి రాసుకుంటాడు. మా సెట్లో ఉన్నవాళ్లు ఎవరిని అడిగినా చెబుతారు అంటూ బన్నీ వాసు సాక్ష్యం అడిగింది. గొడుగు, ఫ్యాన్ ఉండేవి. నేను ఏదైనా సన్ స్క్రీన్ ని రాసుకుంటున్నానంటే అది ఏంటి? ఆ బ్రాండ్ ఏంటి? ఎక్కడి నుంచి తెప్పించారు అని అడిగి మరి వాళ్ళ హెల్పర్లకు అక్కడి నుంచి తీసుకురమ్మని చెప్పేవారు. నేను చెప్పాను కదా ఇక నెక్స్ట్ హీరోనే అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇదంతా దుష్ప్రచారం అంటూ చందు సరదాగా చెప్పుకొచ్చాడు. అందం విషయంలో నటీనటులకు ఏమేమి తెలుసో అవన్నీ చందుకు తెలుసు అని ఆమె చెప్పుకొచ్చింది.