NTV Telugu Site icon

Sai Pallavi: డైరెక్టర్ తో సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి.. సాయి పల్లవి రియాక్షన్ ఇదే ..!

Sai

Sai

Sai Pallavi: చిత్ర పరిశ్రమ అన్నాకా హీరోహీరోయిన్లపై గాసిప్స్, రూమర్స్ రావడం సాధారణమే. కొద్దిగా క్లోజ్ గా మూవ్ అయినా కూడా వారికి ఎఫైర్లు అంటగడుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. ఆ రూమర్లకు హద్దు పద్దు లేకుండా పోయింది. ఎవరు ఎలాంటి ఫోటోలను అయినా తీసుకొని ఎడిట్ చేసి.. ఇష్టమొచ్చిన కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇకపోతే మూడు రోజుల నుంచి సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అన్న వార్తలు నెట్టింట వైరల్ గా మారింది. ఒక డైరెక్టర్ తో సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, అందుకు సంబంధించిన ఫోటో ఇదే అని.. వారిద్దరూ దండలతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇక దీంతో చాలామంది నిజంగానే సాయి పల్లవి పెళ్లి అయిపోయిందని నమ్మేశారు. అసలు ఆ ఫోటో ఏంటి.. ? దాని వెనుక కథ ఏంటి అని ఎవరు పట్టించుకోలేదు. అది ఒక సినిమా పూజా కార్యక్రమం. ఆ డైరెక్టర్ దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తోంది. కోలీవుడ్ లో పూజా కార్యక్రమం అంటే .. చిత్ర బృందం మొత్తానికి దండలు వేసి.. పండితులు వారిని ఆశీర్వదిస్తారు. అలా చిత్రబృందం మొత్తం నిలబడి ఉన్న ఫొటోలో.. కేవలం డైరెక్టర్, సాయి పల్లవి ఫోటోను కట్ చేసి.. పెళ్లి ఫోటోగా చిత్రీకరించారు. ఇక ఈ ఫోటో చాలా వైరల్ గా మారడంతో సాయి పల్లవి రియాక్ట్ అయ్యింది.

Bigg Boss Telugu 7: శివాజీ అన్నది కరక్టే.. ఆ బ్యాచ్ అంతా ఒకటే.. సందీప్ వేస్ట్

“నిజం చెప్పాలంటే, నేను రూమర్‌లను పట్టించుకోను, కానీ అది కుటుంబ సభ్యులైన స్నేహితులను కలిగి ఉన్నప్పుడు, నేను మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి.. అసహ్యకరమైన ఉద్దేశ్యాలతో.. కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా పబ్లిష్ చేయిస్తున్నారు. నా వర్క్ ఫ్రంట్‌లో పంచుకోవడానికి నాకు ఆహ్లాదకరమైన ప్రకటనలు ఉన్నప్పుడు, ఇలాంటి జాబ్ లెస్ పనులు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు.. ఇలా ఎదుటివారినికి అసౌకర్యం కలిగించడం పూర్తిగా నీచమైనది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments