Sai Durga Tej : సాయిదుర్గాతేజ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సంబరాట ఏటిగట్టు మూవీలో నటిస్తున్నాడు. దాంతో పాటే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేశాడు సాయితేజ్. అయితే తాజాగా సాయిదుర్గాతేజ్ యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 ప్రారంభోత్సవంలో ‘మోస్ట్ డిజైరబుల్ (మేల్)’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు.
Read Also : Tollywood : రేపు ఫెడరేషన్, ఛాంబర్ భేటీ.. ముగింపు పలుకుతారా..?
ఈ సందర్భంగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నారు. మీ లైఫ్ లో స్టైలిష్ ఐకానిక్ పర్సన్స్ ఎవరు అని అడగ్గా.. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అంటూ ఆన్సర్ ఇచ్చేశాడు సాయితేజ్. పవన్ కల్యాణ్ చాలా పీస్ ఫుల్ గా ఉంటారని.. రామ్ చరణ్ చుట్టూ ఒక క్రేజ్ ఉంటుందని తెలిపాడు సాయితేజ్. తాను కూడా పవన్ కల్యాణ్ లాగా పీస్ ఫుల్ గా ఉండేందుకు ఇష్టపడుతానన్నాడు సాయితేజ్. ఈ రెడ్ కార్పెట్ మీద నడచుకుంటూ వస్తే ఓ సాంగ్ గుర్తుకొస్తుంది కదా.. అదేంటి అని ఎన్టీవీ రిపోర్టర్ ప్రశ్నించగా.. తనకు మాత్రం మోనికా గుర్తుకొస్తుందని సాయితేజ్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలోని మోనికా సాంగ్ ఈ నడుమ బాగా పాపులర్ అవుతోంది. ఇందులో పూజాహెగ్డే డ్యాన్స్ తో ఇరగదీసింది.
Read Also : Tollywood : రేపు ఫెడరేషన్, ఛాంబర్ భేటీ.. ముగింపు పలుకుతారా..?
