Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చావుతో పోరాడి బయటపడ్డాడు. ఆ తరువాత ఆ ఘటన నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టినా.. ఎంతో ఓర్పుతో కోలుకొని దైర్యంగా నిలబడ్డాడు. ఇక ఆ ఇన్సిడెంట్ తరువాత మొదటిసారి వెండితెరపై విరూపాక్షగా కనిపించబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తేజ్.. సోషల్ మీడియాను మొత్తం వాడేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, షోలు, యూట్యూబ్ స్టార్స్ తో చిట్ చాట్లు చేస్తూ ఎక్కడ చూసినా తేజ్ నే కనిపిస్తున్నాడు. అయితే వీటన్నింటిలో తేజ్.. పంచెకట్టుతో కనిపించడం విశేషం.
Viral Video: వామ్మో.. పార్టీ మారితే ఇంతటి శిక్ష.. మరీ దారుణం
ఇప్పటివరకు ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనే పంచెకట్టుతో కనిపించిన తేజ్.. ఇప్పుడు ఏ ఈవెంట్ కు వెళ్లినా.. వైట్ పంచెతో కనిపిస్తున్నాడు. ఈ పంచెకట్టు వెనుక ఉన్న మతలబు ఏంటి అనేది అంతుచిక్కకుండా ఉంది. మొట్ట మొదటిసారి.. పవన్- బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో తేజ్ పంచెకట్టుతో కనిపించాడు. అక్కడి నుంచి విరూపాక్ష ఈవెంట్స్ మొత్తానికి తేజ్ ఆ పంచెకట్టుతోనే కనిపించాడు. అయితే ఎందుకు తేజ్.. ఇలా పంచె కట్టుకోవాల్సి వచ్చింది. ఏమైనా బ్రాండ్ కు ప్రమోట్ చేస్తున్నాడా..? లేక ప్యాంట్ వేసుకోవడం వలన ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అనేది మాత్రం మిస్టరీగా మారింది. అయినా పంచెకట్టులో కూడా తేజ్ అందంగానే కదా ఉన్నాడు. అలాంటప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ పంచెకట్టు వెనుక ఉన్న మతలబు ఏంటి అనేది తేజ్ చెప్తే తప్ప తెలియదేమో..