Site icon NTV Telugu

Sai Dharam Tej: రాజకీయాలోకి ఎంట్రీ.. పవన్ మామ ఏది చెప్తే అది చేస్తా

Pawan

Pawan

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దాదాపు ఏడాది తరువాత తేజ్ నుంచి వచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని తేజ్ రీ ఎంట్రీ మరింత జోష్ ను నింపింది. ఇక ప్రస్తుతం తేజ్.. పవన్ కళ్యాణ్ తో పాటు బ్రో సినిమాలో నటిస్తున్నాడు. సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే తేజ్.. గత కొన్నిరోజులుగా ఆలయాలనుసందర్శిస్తున్నాడు. ఇటీవలే తిరుపతిలో సందడి చేసిన తేజ్.. తాజాగా ప్రఖ్యాత కడప అమీన్ పీర్ దర్గా ను హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు.

Sunny Leone: నా భర్త నన్ను మోసం చేశాడు.. అర్ధరాత్రి ఆ పని చేస్తూ

ఇక ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ.. “కడపకు వస్తే పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ..ఆ ప్రమాదం నుంచి బయటపడడం నాకు పునర్జన్మ. దేవుడు మళ్లీ నాకు పునర్జన్మను అందివ్వడంతో ఆలయాలను తిరుగుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక సినిమాల గురించి చెప్పాలంటే.. పవన్ మామయ్యతో కలిసి నటించడం మరువలేని అనుభూతి. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. పవన్ మామయ్య జనసేన పార్టీలోకి వస్తారా అని నన్ను అడుగుతున్నారు. రాజకీయాలపై అవగాహన ఉంటే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారు.. నేను సినీ రంగంలోనే ఉంటా.. మామయ్య అదే చెప్పారు.. మామయ్య పవన్ కల్యాణ్‌ అంటే నాకు ప్రాణం” అంటూ తేజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో మామఅల్లుళ్లు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version