యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా మారుతీ దర్వకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా చక్కని స్పందన వచ్చింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ‘మహానుభావుడు’ లాంటి హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ బ్యానర్ లో ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు.
Read Also : షూటింగ్ లోనే పంద్రాగస్ట్ వేడుకలు!
‘టాక్సీవాలా’ తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ మూవీ నుంచి ‘సో సో గా ఉన్న’ ప్రోమో సాంగ్ విడుదలైంది. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ప్రముఖ లిరిక్ రైటర్ కేకే రాసారు. ఆగస్ట్ 16న ఫుల్ సాంగ్ ను సుప్రీమ్ హీరో సాయితేజ్ విడుదల చేయనున్నారు. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.