మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మరిచినట్లు తెలిపారు. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యబృందం వెల్లడించింది. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న సాయితేజ్, మాట్లాడగలుగుతున్నారని తెలిపింది. మరో రెండు, మూడురోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు పేర్కొంది.
వినాయక చవితి రోజు రాత్రి సాయితేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి అందరికి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జ్-ఐకియూ మార్గంలో బైక్ పై వెళుతున్న క్రమంలో బైక్ స్కిడ్ సాయి తేజ్ గాయపడ్డారు. వెంటనే ఆయనను మెడికవర్ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. అనంతరం అపోలో హాస్పిటల్ కు షిప్ట్ చేశారు. ప్రత్యేక వైద్య బృందం సాయి తేజ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ.. ఆయన కాలర్ బోన్ ఆపరేషన్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగైంది.