Site icon NTV Telugu

Sai Dharam Tej: బాగా ఇబ్బంది పడ్డా.. అప్పుడే విలువ తెలిసింది!

Sai Dharam Tej Bro Movie

Sai Dharam Tej Bro Movie

Sai Dharam Tej about Shooting Difficulties of Bro Movie: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో తమిళ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించగా సినిమా రిలీజ్ కి రెడీ అయింది. జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకోగా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో యూనిట్ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన సాయి ధరమ్ తేజ్, బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వారితో పంచుకున్నారు.

Bhola Shankar: మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. చిరు కోసం చెర్రీ

తనను సినీ పరిశ్రమలో నా కెరీర్ ప్రారంభంలో ఎవరైతే సపోర్ట్ చేశారో, ఆయన(పవన్ కళ్యాణ్)తో కలిసి నటించే అవకాశం వచ్చిందని, ఇది నన్ను నేను నిరూపించుకునే అవకాశం అని అన్నారు. అందుకే కథ కూడా వినకుండా సినిమా చేయడానికి అంగీకరించానని పేర్కొన్న ఆయన అసలు ఒరిజినల్ మూవీ చూడలేదని అన్నారు. ఇది నా కెరీర్ కి ట్రిబ్యూట్ ఫిల్మ్ అని పేర్కొన్న ఆయన నేను గురువుగా భావించే మావయ్యతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు. యాక్సిడెంట్ తర్వాత అప్పటికి ఇంకా పూర్తిగా కోలుకోలేదని షూట్ మొదలైన కొత్త మాట ఇంత గట్టిగా వచ్చేది కాదని అన్నారు. డైలాగ్ లు చెప్పేటప్పుడు ఇబ్బంది పడ్డానని పేర్కొన్న ఆయన ఆ సమయంలో నాకు మాట విలువ తెలిసిందని అనరు. డబ్బింగ్ విషయంలో బాగా కష్టపడ్డానని, అప్పుడు నాకు పప్పు గారు బాగా సపోర్ట్ చేశారని అన్నారు. విరూపాక్ష సమయంలో కూడా ఆయన బాగా సపోర్ట్ చేశారని తేజ్ చెప్పుకొచ్చారు.

Exit mobile version