Sadha: సెట్ లో దాన్ని చూసి గావుకేకలు పెట్టిన సదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sadha: జయం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సదా. వెళ్ళవయ్యా.. వెళ్ళు అంటూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ భామ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన సదా .. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. సినిమా అవకాశాలు తగ్గడంతో ఈ భామ.. డ్యాన్స్ షోలకు జడ్జిగా వెళ్తోంది. ఒకప్పుడు ఢీ షోలో సందడి చేసిన ఈ భామ.. ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ అనే డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అలనాటి నటి రాధ, డ్యాన్స్ మాస్టర్ తరుణ్ మాస్టర్ తో పాటు సదా కూడా అందాల ఆరబోతతో అదరగొడుతోంది. ఇక ఈ షో సెమీ ఫైనల్ వరకు వచ్చింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ అందరూ.. తమకు నచ్చిన థీమ్ తో అదరగొడుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమోలో సదాను భయపెట్టినట్లు చూపించారు. ఇందులో కంటెస్టెంట్స్.. కొందరు ఆగస్టు 15 కావడంతో దేశభక్తికి సంబంధించిన థీమ్ తో రాగా.. అంజలి- పవన్ జంట మాత్రం హర్రర్ థీమ్ తో వచ్చారు. అందులో అంజలి దెయ్యంగా కనిపించగా.. దెయ్యం నుంచి తప్పించుకొనే యువకుడిగా పవన్ కనిపించాడు.
Jailer 2: ‘జైలర్ 2’ ప్రకటించిన డైరెక్టర్.. రజినీ- విజయ్ కాంబోలో..
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ఇక అంజలి మేకప్ అతి క్రూరంగా ఉండడంతో సదా ఒక్కసారిగా భయపడిపోయింది. ఆ డ్యాన్స్ యాక్ట్ ను ఆపాలంటూ సెట్ లో గావు కేకలు పెట్టింది. ఈ విషయంలో జోక్స్ పనికిరావని, తన దగ్గరకు వచ్చి అంజలి ముఖం చూపించవద్దని, తాను చాలా సెన్సిటివ్ అని అరవడం మొదలుపెట్టింది. భయంతో కళ్ళు మూసుకొని దయచేసి ఈ యాక్ట్ ఆపాలంటూ ఆమె గట్టిగా కేకలు పెట్టింది. ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. నిజం చెప్పాలంటే.. సదాకు దెయ్యాలు అన్నా.. హర్రర్ కు సంబంధించిన విషయాలు అన్నా చాలా భయమని ఆమె చాలా ఇంటర్వ్యూల్లో తెలిపింది. మరి ఈ డ్యాన్స్ ఎపిసోడ్ పై ఆమె ఎలా స్పందించిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!