800 Trailer: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ట్రైలర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా సచిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా సెప్టెంబర్ 5న ముంబైలో ‘800’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇటు సచిన్ ఇండియా తరఫున, అటు మురళీధరన్ శ్రీలంక తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. మైదానంలో పోటీ పడినప్పటికీ… మైదానం వెలుపల ఇద్దరు మధ్య మంచి స్నేహం ఉంది. మురళీధరన్ కోసం ‘800’ ట్రైలర్ విడుదల చేయడానికి సచిన్ వస్తున్నారు.
‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయనున్నారు. అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ విడుదల గురించి ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”సచిన్ టెండూల్కర్ గారు మా ‘800’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతో పాటు ప్రముఖ క్రికెటర్లు, సినీ ప్రముఖులు సైతం హాజరు కానున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చెప్పారు.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!