Sandra Bullock: హాలీవుడ్ హాట్ హీరోయిన్స్ లో సాండ్రా బుల్లాక్ ఒకరు. ఆమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక అందాల ఆరబోత చేయడంలో కానీ, పాత్రకు తగ్గట్టు నగ్నంగా నటించమన్నా కానీ, ఆమె దేనికి వెనుకాడదు. ప్రస్తుతం ఆమె వయస్సు 59. రెండు రోజుల క్రితమే ఆమె తన 59 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సాండ్రాకు బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే ఆమె సహనటుల్లో ఒకరైన ర్యాన్ రెనాల్డ్స్ మాత్రం ఎంతో నీచంగా ఆమెకు విషెస్ చెప్పాడు. ప్రస్తుతం అతనిని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అంతలా సాండ్రాకు అతడు ఎలా విష్ చేశాడు అంటే.. ఆమె నగ్న వీడియోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పాడు.
King Of Kotha: దుల్కర్ ఈసారి దుమ్మురేపేలానే ఉన్నాడు..
అవును.. మీరు విన్నది నిజమే. వీరిద్దరూ కలిసి ది ప్రపోజల్ అనే సినిమా చేశారు. అందులో ఒక సీన్ కోసం ఇద్దరు నగ్నంగా ఉండాల్సి వచ్చింది. అప్పట్లో ఈ సీన్ చాలా సంచలనాన్న రేకెత్తించింది. ఇక ఆ సీన్ వీడియోను షేర్ చేస్తూ.. ” అసమానమైన, అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న సాండ్రాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈసారి నీ పుట్టినరోజున.. నేను మన ఇద్దరి సాన్నిహిత్యం సమన్వయకర్తలను పొందాను. వారిలో ఒకరు హెచ్‌ఆర్ విభాగం, రెండోది దుస్తులు?” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అతనిని ఏకిపారేస్తున్నారు. ఇలాంటి వీడియో పోస్ట్ చేయాల్సిన అవసరమా ఏంటి.. ? ఇదేనా సభ్యత అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
