Nagachithanya : ఇండస్ట్రీలో కొత్తగా పెళ్లి అయిన జంటలపై వచ్చే కామన్ రూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరెంట్స్ కాబోతున్నారని.. ప్రెగ్నెంట్ అయిందని.. ఒకటా రెండా.. ఇప్పటికే ఎంతో మంది కపుల్స్ మీద ఇలాంటి రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు స్టార్ కపుల్ నాగచైతన్య, శోభిత మీద కూడా ఇలాంటి రూమర్లే వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే శోభితతో గడుపుతున్న ఫొటోలను కూడా నాగచైతన్య పంచుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ ఇద్దరూ పేరెంట్స్ కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున రూమర్లు వస్తున్నాయి.
Read Also : Vijay Devarakonda : ఒకేసారి రెండు సినిమాలు.. విజయ్ ఏంటీ స్పీడు..
టాలీవుడ్ లో ఇదే విషయంపై పెద్ద రచ్చ జరుగుతోంది. శోభిత కన్సివ్ అయిందని.. అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. వీరిద్దరూ ప్రస్తుతం ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కొన్ని రోజుల పాటు పిల్లల్ని కనే ఆలోచనలో లేదు ఈ జంట. అటు నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. శోభిత ఇంటివద్దే ఉంటూ చైతన్యకు కావాల్సినవి చూసుకుంటోంది. ఏదైనా ఉంటే వారే అధికారికంగా ప్రకటించేస్తారు కదా.. అప్పటి వరకు ఆగకుండా ఇలాంటి రూమర్లు అవసరమా అంటూ వారి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Read Also :Varun Tej : డిజాస్టర్ దర్శకుడితో మెగా ప్రిన్స్ సినిమా.?