మే నెల వస్తే చాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎక్కడ లేని ఎనర్జీతో ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఫాన్స్ జోష్ మరింత పెరిగింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఈ నెల అంతా ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోస్, ఫ్యాన్ మేడ్ వీడియోస్ ఇలా ఎదో ఒకటి ట్రెండ్ చేస్తూ మే నెల మొత్తం సోషల్ మీడియాని కబ్జా చేస్తారు. ఎప్పటిలానే ఈసారి కూడా మే నెల వచ్చేసింది, మరో వారం రోజుల్లో ఎన్టీఆర్ బర్త్ డే వచ్చేస్తుంది, సోషల్ మీడియాలో ఫాన్స్ హంగామా కూడా మొదలైపోయింది. ఆన్ లైన్ మాత్రమే కాదు ఈసారి ఆఫ్ లైన్ కూడా నెవర్ బిఫోర్ హిస్టీరియా చూపించడానికి రెడీ అయిన ఫాన్స్, సింహాద్రి సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. చారిటీ కోసం చేస్తున్న ఈ రీరిలీజ్, ఇప్పటివరకూ ఏ రీరిలీజ్ సినిమా మైంటైన్ చెయ్యనంత హైప్ ని సొంతం చేసుకుంది.
Read Also: Ustaad Bhagat Singh: దెబ్బకి యుట్యూబ్ బద్దలైపోయింది…
ఎన్టీఆర్, రాజమౌళిల కాంబినేషన్ కావడంతో సింహాద్రి సినిమాని మళ్లీ థియేటర్ లో చూసి ఎంజాయ్ చెయ్యడానికి ఫాన్స్ రెడీ అయ్యారు. కేవలం ఓవర్సీస్ లోనే 100 స్క్రీన్ లో సింహాద్రి రిలీజ్ అవుతుంది అంటే క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సింహాద్రి రీరిలీజ్ కి ఇంకా వారం రోజుల సమయం ఉండగానే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, కంప్లీట్ అవ్వడం, హౌజ్ ఫుల్ షోస్ బోర్డ్ పడడం కూడా జరిగిపోయాయి. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింహాద్రి రీరిలీజ్ కోసం ఏర్పాటు చేసిన ఆరు షోస్ హౌజ్ ఫుల్స్ పడ్డాయి. ఒక రీరిలీజ్ సినిమాకి ఈ రేంజ్ బుకింగ్స్ రావడం అంటే ఎన్టీఆర్ ఫాన్స్ మే 20న ఎలాంటి హంగామా చెయ్యబోతున్నారో ఊహించొచ్చు. రీరిలీజ్ ట్రెండ్ లోనే ఎన్టీఆర్ ఫాన్స్ క్రియేట్ చెయ్యబోయే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.