NTV Telugu Site icon

RRRforOscars: ఎన్టీఆర్, చరణ్ ల కష్టానికి ఫలితం దక్కనుంది…

Natu Natu

Natu Natu

ఇండియాలో సూపర్బ్ గా డాన్స్ చేయగల హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తప్పకుండా ఉంది. ఎలాంటి స్టెప్ నైనా వేయగల ఈ ఇద్దరిలో… చరణ్ బలం ‘గ్రేస్’ అయితే ఎన్టీఆర్ ‘స్పీడ్’. ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాదు భారతదేశం ఊగిపోతుందని నిరూపించింది ‘నాటు నాటు’ సాంగ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో చరణ్ ఎన్టీఆర్ లని పెట్టి డాన్స్ సాంగ్ పెట్టక పోతే ఎలా అనుకున్నాడో? లేక ఇండియన్ డాన్స్ లో ఉండే మజా ఏంటో ఆడియన్స్ ని చూపిద్దాం అనుకున్నాడో కానీ రాజమౌళి వేసిన మాస్టర్ ప్లాన్ థియేటర్స్ లో వండర్స్ క్రియేట్ చేసింది. చరణ్ ఎన్టీఆర్ లు డాన్స్ చేస్తుంటే సినీ అభిమానులు కళ్ళప్పగించి చూసారు. మెగా నందమూరి అభిమానులు ఏ హీరో బాగా చేశాడా అని వెతకడానికి ప్రయత్నించారు కానీ ఇద్దరూ ఎక్కడా తగ్గకపోవడంతో ‘నాటు నాటు’ సాంగ్ అందరికీ స్పెషల్ గా నిలిచింది. ఇద్దరు సూపర్ డాన్సర్స్ కి చెమటలు పట్టేలా చేసిన ఘనత మ్యూజిక్ డైరెక్టర్ ‘కీరవాణీ’కే దక్కుతుంది. తన ట్యూన్ తో కీరవాణీ, మెప్పిస్తే దాన్ని అంతే అద్భుతంగా పాడారు ‘కాల భైరవ’, ‘రాహుల్ సిప్లిగంజ్’. చరణ్, ఎన్టీఆర్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, కీరవాణిలు కలిసి ‘నాటు నాటు’ సాంగ్ ని మాస్ పాటలకి ఒక బెంచ్ మార్క్ లా సెట్ చేశారు.

ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు హాలీవుడ్ ఆడియన్స్ కూడా ‘నాటు నాటు’ సాంగ్ ని చిందేస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్ టీం’ ‘నాటు నాటు’ పాట కోసం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కేలా ఉంది. ఈ సాంగ్ ఆస్కార్ ఇండియాకి తెచ్చేలాగే ఉంది. ఆర్ ఆర్ ఆర్ ‘ఆస్కార్’ ఆశ నిజమయ్యే అవకాశం ఉందని చెప్తూ… ‘హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్’ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ‘సీనియర్ అవార్డ్ కాలమిస్ట్ స్కాట్ ఫీన్బర్గ్’ అంచనా ప్రకారం ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలిచే ఆస్కారం ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ వస్తుందని ‘స్కాట్ ఫీన్బర్గ్’ ప్రిడిక్ట్ చేశాడు. ‘స్కాట్’ ప్రిడిక్షన్స్ చాలా వరకూ నిజమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ‘నాటు నాటు’ పాట ఆస్కార్ ని ఇండియాకి తీసుకోని రావడం గ్యారెంటీ. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలోనే కాకుండా ‘బెస్ట్ పిక్చర్’ కేటగిరిలో నిలవబోయే సినిమాలకి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని ‘స్కాట్ ఫీన్బర్గ్ ‘ ప్రిడిక్ట్ చేశాడు. ఏ కేటగిరిలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఆస్కార్ గెలిచినా, ఇండియన్ సినిమా హాలీవుడ్ లో జెండా ఎగరేసినట్లే అవుతుంది.