Site icon NTV Telugu

‘ఆర్ఆర్ఆర్’ కు రెండు రిలీజ్ డేట్లు.. ఈసారి పక్కా అంట

rrr

చిత్ర పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తున్నచిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ అస్సలు రిలీజ్ అవుతుందా..? అనే డౌట్ ని అభిమానుల్లో క్రియేట్ చేసింది. ఇక ఆ అనుమానాలకు తెరలేపుతూ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి కాదు ఏకంగా రెండు రిలీజ్ డేట్లు ప్రకటించి ఔరా అనిపించారు.

“కరోనా కలకలం తొలగిపోయి అన్ని పరిస్థితులు అనుకూలించి పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభమైతే మార్చ్‌ 18న విడుదలచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అలా జరగకుంటే ఎలాంటి పరిస్థితులున్నా సరే ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ని రిలీజ్ చేస్తాం” అని చెప్పుకొచ్చారు. దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా.. తారక్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తోంది. మరి ఈసారైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా..? అనేది చూడాలి.

Exit mobile version