RRR: చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ లకి జేజేలు కొట్టిన వెస్ట్ ఆడియన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023లో మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీ అంటే ఇండియన్ ఆడియన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఆర్ ఆర్ ఆర్’. కరోనాతో వీక్ అయిన సినిమా మార్కెట్ ని ఊపిరి పోస్తూ దర్శక ధీరుడు తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ‘ఆర్ ఆర్ ఆర్’. చరణ్, ఎన్టీఆర్ లాంటి యాక్టింగ్ పవర్ హౌజ్ లు కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఇంఫాక్ట్ ఆర్ ఆర్ ఆర్ సౌండ్ బౌండరీలు దాటి వినిపించడం మొదలయ్యింది. ఇండియాలో 1200 కోట్లు రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా, వెస్ట్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాకి రానంత రీచ్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి వచ్చింది. ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో ఉన్న మన ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈవెంట్స్ లో జెండా ఎగరేస్తోంది.
తాజాగా వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ అయిన “ది క్రియేటివ్ లైఫ్, TCL చైనీస్ థియేటర్స్” లో స్క్రీనింగ్ జరిగింది. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణిల సమక్షంలో జరిగిన ఈ స్క్రీనింగ్ లో మన ఇండియన్ సినిమాకి వెస్ట్ ఆడియన్స్ జేజేలు కొట్టారు. ఒక భారతీయ సినిమాకి వెస్ట్రన్ ఆడియన్స్ లో ముందెన్నడూ రాని గుర్తింపుని ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదించింది. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్క్రీన్ పైన ఆర్ ఆర్ ఆర్ సినిమాని చూస్తూ లాస్ ఏంజిల్స్ ఆడియన్స్ పూనకలు వచ్చినట్లు ఊగిపోయారు. నాటు నాటు సాంగ్ కి స్క్రీన్ ముందుకి వెళ్లి డాన్స్ వేశారు. చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపిస్తే అరుపులు కేకలు పెట్టారు, ఎన్టీఆర్ కొమురం భీముడో సాంగ్ కి ఎమోషనల్ అయ్యారు. ఎమోషన్స్ ఇండియాన్స్ మాత్రమే కాదు మనుషులు అందరికీ ఒకేలా ఉంటాయని వెస్ట్ ఆడియన్స్ నిరూపించారు. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడి మీడియా అండ్ ఆడియన్స్ తో ‘ఆర్ ఆర్ ఆర్ టీం’ Q&A’ సెషన్ లో పాల్గొన్నారు. చరణ్, ఎన్టీఆర్ లు వెస్ట్రన్ మీడియాకి స్పెషల్ ఇంటర్వూస్ ఇస్తున్నారు.
Also Read
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!