RRR: రేపటి నుంచి ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈనెల 25న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెరిగాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం సిద్ధమైంది.
ఈ మేరకు మూవీ యూనిట్ షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి 23వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి పర్యటించనున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీళ్లు దుబాయ్‌కు పయనం కానున్నారు. అటు ఈ నెల 19న బెంగళూరులో మూవీ యూనిట్ పర్యటించనుంది. అదేరోజు చిక్బల్లాపూర్లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొననుంది. మార్చి 20న బరోడా, ఢిల్లీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి పర్యటించనున్నారు. మార్చి 21న పంజాబ్‌లోని అమృత్సర్, రాజస్థాన్‌లోని జైపూర్‌లో మూవీ యూనిట్ ప్రచారం నిర్వహించనుంది. మార్చి 22న కోల్‌కతా, వారణాసిలో పర్యటించనుంది. మార్చి 23న తిరిగి మూవీ యూనిట్ హైదరాబాద్ చేరుకోనుంది.
Also Read
- Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
తాజావార్తలు
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!