స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ మూవీ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఎంత గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్లలో రికార్డులు బద్దలుకొట్టిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఒకవైపు బైక్‌పై ఎన్టీఆర్ కనిపిస్తుండగా.. మరోవైపు గుర్రంపై రామ్‌చరణ్ సవారీ చేస్తున్నాడు. ఈ పోస్టర్ అటు నందమూరి, ఇటు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Read Also: Naresh Pavithra Lokesh: పవిత్ర లోకేష్‌ను చెప్పుతో కొట్టబోయిన రమ్య
అలాగే ‘RRR’ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్(HCA) ఇచ్చే మిడ్ సీజన్ అవార్డ్స్‌లో ఈ సినిమా రన్నరప్‌గా నిలిచింది. ఈ విషయాన్ని హెచ్‌సీఏనే సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం ఎంపికైంది. దీంతో ఆర్.ఆర్.ఆర్ సినిమా అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకున్నట్లు అయ్యింది. ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.
RRRIDING HIGHHHH….. 100 Days of #RRRMovie!!@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @mmkeeravaani @aliaa08 @OliviaMorris891 @DVVMovies @RRRMovie pic.twitter.com/cFcP6CaYgK
— DVV Entertainment (@DVVMovies) July 2, 2022