RRR Pre Release event పై అధికారిక ప్రకటన వచ్చేసింది. RRR భారతదేశపు అతిపెద్ద మల్టీస్టారర్ ప్రమోషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురూ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక మార్చ్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమా కోసం భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారు మేకర్స్. ముఖ్యంగా కర్ణాటకలో భారీ ఈవెంట్ జరగనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇప్పటివరకూ ప్రచారం జరిగినట్టుగా మార్చ్ 19న కర్ణాటకలోని చిక్కబల్లాపురలో సాయంత్రం 6 గంటలకు RRR Pre Release event జరగనుంది.
Read Also : NBK107 : శాండల్ వుడ్ సెన్సేషన్ పవర్ ఫుల్ రోల్ రివీల్
ఈ విషయాన్ని కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్ వెల్లడించింది. ఇక RRR Pre Release event పాసుల కోసం kvnproductions.co.in లోకి లాగ్ ఇన్ అవ్వాలని సూచించారు. అయితే ఈ వేడుకకు గెస్టులు ఎవరన్న విషయాన్ని మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం. భారీ ఎత్తున జరగనున్న RRR Pre Release eventకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కాగా కన్నడ, తెలుగు మినహా తమిళం, మలయాళం, హిందీ భాషల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు ఇంతకుముందే జరిగిన విషయం తెలిసిందే.
Hold your excitement for 3 more days! Witness India's Biggest #PreReleaseEvent on March 19th.
— KVN Productions (@KvnProductions) March 16, 2022
For passes logon to https://t.co/77uk0Qjg1e@ssrajamouli sir @tarak9999 @AlwaysRamCharan @Aliaabhat @ajaydevgn @OliviaMorris891 @DVVMovies#RRRMovie #RRRMovieonMarch25th pic.twitter.com/1f9ioraH7u