2022 మార్చ్ 25న ఇండియన్ సినిమాలో ఒక అద్భుతం జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కీరవాణిలు సృష్టించిన అద్భుతం అది. ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఆస్కార్ వేదికపై ఇండియన్ ఫ్లాగ్ ని ఎగరేసిన ఆ అద్భుతం పేరు ‘ఆర్ ఆర్ ఆర్’. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు, ఎన్నో అవార్డులు రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారతీయ సినిమాకి గౌరవాన్ని తెచ్చింది. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ సౌండ్ ఏడాది కాలంగా వినిపిస్తూనే ఉంది. ఆ సౌండ్ గత వంద రోజులుగా జపాన్ లో రీసౌండ్ అవుతూనే ఉంది. 1 మిలియన్ ఫుట్ ఫాల్స్ ని రాబట్టి, ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని వంద కోట్ల మార్క్ ని జపాన్ లో రీచ్ అయిన ఫస్ట్ సినిమాగా ఆర్ ఆర్ ఆర్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు, రోజు రోజుకీ మన సినిమా అక్కడ స్ట్రాంగ్ అవుతూనే ఉంది.
ఫుట్ ఫాల్స్ లో డ్రాప్ కనిపించకపోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. రజినీకాంత్ ముత్తు సినిమాని ఎప్పుడో వెనక్కి నెట్టి పాతికేళ్ల రికార్డులని చెల్లా చెదురు చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మూడు మేజర్ ఏరియాల్లో వంద కోట్లు రాబట్టిన ఏకైక ఇండియన్ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇండియా, అమెరికా, జపాన్… ఈ మూడు సెంటర్స్ లో వంద కోట్లు రాబట్టిన మొదటి ఇండియన్ సినిమా ఆర్ ఆర్ ఆర్ మాత్రమే. గతంలో ఎన్నో సినిమాలు అమెరికా, ఇండియాలో వంద కోట్లు రాబట్టాయి కానీ జపాన్ మార్కెట్ ని కదిలించలేకపోయాయి. ఆ పనిని సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా, ఇక రాజమౌళి చెప్పినట్లు చైనాలో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాని రిలీజ్ చేస్తే అక్కడ కూడా సాలిడ్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాని డ్రాగన్ కంట్రీకి తీసుకోని వెళ్తాడో లేదో చూడాలి.