RRR: రాజమౌళికి జేమ్స్ కామరూన్ హాలివుడ్ లో ఓపెన్ ఆఫర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వరల్డ్ సినిమాలో రీసౌండ్ వచ్చేలా వినిపిస్తున్న ఒకేఒక్క పేరు రాజమౌళి. మన ఇండియన్ సినిమా గ్లోరీ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమాని రూపొందించిన ఈ మేకింగ్ మాస్టర్, ఒక ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకి చేరుతోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో నిలిచింది. ఆ ప్రెస్టీజియస్ స్టేజ్ పైన మార్చ్ 12న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏ కేటగిరిలో అయినా ఆస్కార్ గెలిస్తే అది దేశానికే గర్వకారణం. ఇండియా సినిమా స్థితిగతి పూర్తిగా మార్చేస్తున్న రాజమౌళికి, మేకింగ్ మాస్టర్ జేమ్స్ కామరూన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. హాలీవుడ్ లో సినిమా చెయ్యాలి అనుకుంటే మనం మాట్లాడుకుందాం అంటూ రాజమౌళికి హాలీవుడ్ మూవీ ఆఫర్ ఇచ్చాడు జేమ్స్ కామరూన్. ఇటివలే రాజమౌళి, తన ఫేవరేట్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామరూన్ ని గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఆఫ్టర్ పార్టీలో మీట్ అయ్యాడు.
ఈ సంధర్భంగా రాజమౌళితో దాదాపు నాలుగు నిమిషాల పాటు మాట్లాడిన జేమ్స్ కామరూన్… “నీ సెటప్, స్టొరీని రివీల్ చేసిన విధానం, క్యారెక్టర్స్ మధ్య ప్లే చేసిన ఎమోషన్, ఎలివేట్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసి ఆశ్చర్యపోయాను. ఈరోజు మీరు టాప్ ఆఫ్ ది వరల్డ్ ఉండి ఉంటారు. యు డిసర్వ్ ఇట్. హాలీవుడ్ లో సినిమా చెయ్యాలి అనుకుంటే మనం మాట్లాడుకుందాం” అని చెప్పాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న జేమ్స్ కామరూన్ వైఫ్ ‘సూజీ’ కూడా రాజమౌళితో మాట్లాడుతూ… “జేమ్స్ కామరూన్ మీ సినిమాని రెండు సార్లు చూశాడు. ఫస్ట్ టైమ్ తను మాత్రమే చూసి, సెకండ్ టైమ్ నాతో కలిసి చూశాడు. అమేజింగ్ ఫిల్మ్ తీసారు, కంగ్రాట్స్” అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని 320 రోజుల్లో కంప్లీట్ చేశాడు అని వినీ జేమ్స్ కామరూన్ ఆశ్చర్యపోవడం విశేషం. జేమ్స్ కామరూన్ ఇచ్చిన హాలీవుడ్ ఆఫర్ కి రాజమౌళి నవ్వి సైలెంట్ అయిపోయాడు కానీ చేస్తాను అని సమాధానం చెప్పలేదు. మరి జేమ్స్ కామరూన్ ఆఫర్ ని రాజమౌళి ఎలా టేకప్ చేస్తాడో చూడాలి.
Also Read
"If you ever wanna make a movie over here, let's talk"- #JamesCameron to #SSRajamouli. 🙏🏻🙏🏻
Here’s the longer version of the two legendary directors talking to each other. #RRRMovie pic.twitter.com/q0COMnyyg2
— RRR Movie (@RRRMovie) January 21, 2023
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!