Site icon NTV Telugu

ఆర్ఆర్ఆర్: హైదరాబాద్ వీధుల్లో హాలీవుడ్​ బ్యూటీ చిరుతిళ్ళు

Olivia Morris

Olivia Morris

పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ముగిసిన విషయం తెలిసిందే.. రీసెంట్ గా చిత్రబృందం అంత హైదరాబాద్ వచ్చేసింది. హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్‌ కూడా సిటీలో ప్రత్యేక్షమైంది. ఈ విదేశీ బ్యూటీ హైదరాబాద్ వీధుల్లో తెగ సందడి చేసింది. కొన్నిచోట్ల ఎవరు ఆమెను గుర్తించి, గుర్తించకపోవడంతో నవ్వులు పూయించింది. సిటీ విధుల్లో చిరుతిళ్ళు, పానీపూరీలు తింటూ కనిపించింది. ఆమె వెంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అనురెడ్డి కూడా వుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

ఎన్టీఆర్ – చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీపై త్వరలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చరణ్ సరసన ఆలియాభట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్ జోడిగా ఒలీవియా మోరీస్‌ నటిస్తుంది.

Exit mobile version