Trigger: ఆస్కార్స్ కి ఆర్పీ పట్నాయక్ ట్రిగ్గర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RP Patnaik’s Trigger Short film got qualification for the entry into “THE OSCARS”: ఒరిస్సాలో జన్మించిన ఆర్పీ పట్నాయక్ మాతృభాష తెలుగయినా ఆయన తండ్రి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉండేవారు. ఇక ఆంధ్రా యూనివర్సిటీ నుండి స్పేస్ ఫిజిక్స్ లో పీజీ చేశాక, ఆర్పీ మనసు చెప్పినట్టు విని సినిమా రంగంలో అడుగుపెట్టి 99లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీ కోసం’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. డైరెక్టర్ తేజ తన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘చిత్రం’కు ఆర్పీతో బాణీలు కట్టించగా ఆ సినిమా ఘనవిజయంతో తేజ, ఆర్పీ పట్నాయక్ జోడీ యువతను అలరిస్తూ ముందుకు సాగింది. ఉత్తమ సంగీత దర్శకునిగా తన సత్తా చాటుకుంటూనే మాస్ ను విశేషంగా ఆకట్టుకునే బాణీలతో సందడి చేసిన ఆర్పీ 2004లో ‘శీను వాసంతి లక్ష్మి’ చిత్రంతో నటుడిగా తెరపై కూడా కనిపించారు.
Nitya Menen: ఛీ..నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది.. స్టార్ హీరో వేధింపుల రూమర్స్ పై నిత్యా క్లారిటీ
Also Read
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
దర్శకుడు కావాలనే చిత్రసీమలో ప్రవేశించిన ఆర్పీ పట్నాయక్ 2008లో ‘అందమైన మనసులో’ సినిమాతో అభిలాష తీర్చుకుని “బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్, అమి, తులసీదళం, మనలో ఒక్కడు” లాంటి సినిమాలకు సైతం దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు ఆయన హాలీవుడ్ లో చేసిన ఒక షార్ట్ ఫిలిం ఆస్కార్ రేసులోకి వెళ్లిందని ఆయన ప్రకటించారు. ‘’హాలీవుడ్లో నేను దర్శకత్వం వహించిన TRIGGER అనే షార్ట్ ఫిల్మ్ “THE OSCARS”లోకి ప్రవేశించడానికి అర్హత పొందిందని ప్రకటించినందుకు చాలా సంతోషిస్తున్నాను, దీన్ని సాధ్యం చేసిన నా నిర్మాతలు, వారి మద్దతుతో తారాగణం, సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ఆయన రాసుకొచ్చారు. ఇక ఆయన డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఆస్కార్స్ లోకి వెళ్లేందుకు బరిలోకి దిగడంతో ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!