విజయ్ ఆంటోని రిలీజ్ చేసిన రాయ్‌లక్ష్మి ‘సిండ్రెల్లా` మూవీ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామర్ డాల్ రాయ్‌లక్ష్మి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘సిండ్రెల్లా’. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో మంచాల రవికిరణ్, ఎం.ఎన్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయ్ లక్ష్మి, రోబో శంకర్, అభినయ, అరవింద్ ఆకాశ్, సాక్షి అగర్వాల్, వినోద్, అన్బు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఎస్. జె. సూర్య దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన విను వెంకటేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విజయ్ ఆంటోని రిలీజ్ చేశారు. హారర్ ఫాంటసీ, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘సర్కార్ 3, కిల్లింగ్ వీరప్పన్’ చిత్రాలకు కెమెరామెన్‌గా వర్క్ చేసిన రమ్మీ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందించారు. ‘కాంచన 2’ చిత్రానికి సంగీతాన్ని అందించిన అశ్వామిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే ‘గేమ్ ఓవర్’ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన సచిన్ ‘సిండ్రెల్లా’రే చేసిన సౌండ్ డిజైనింగ్ హైలైట్ కానుంది. ఈ నెల 24న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత మంచాల రవికిరణ్, సహ నిర్మాత ఎం.ఎన్.రాజు తెలిపారు.
Also Read

తాజావార్తలు
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
-
Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్‌కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్‌లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!