ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు సినిమాలతోనే ఫ్యూచర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలో విజయ్ దేవరకొండ గ్రోత్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం యంగ్ హీరోలు విజయ్ కి ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ మరే హీరోకి లేదు. అలాంటి విజయ్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. తప్పక హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో విజయ్ లవ్ స్టోరీని నమ్మి ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఫ్యాన్స్ లో అయోమయంలో పడేసింది. ఇటీవలే నేషనల్ వైడ్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ… ఈ ఇంటరాక్షన్ లో “తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరూ టాలెంటెడ్. వారితో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తా” అని చెప్పాడు.
అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు లు టాలెంటెడ్ డైరెక్టర్స్ అనే విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్స్ లేవు కానీ ఈ టాలెంటెడ్ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేసినప్పుడే రిజల్ట్ తేడా కొడుతున్నాయి. మంగాత్తా, మానాడు లాంటి మైండ్ గేమ్ సినిమాలు చేసిన వెంకట్ ప్రభు… కస్టడీ సినిమాతో నాగ చైతన్యకి షాక్ ఇచ్చాడు. వారియర్ సినిమాతో లింగుస్వామి రామ్ పోతినేనికి జర్క్ ఇచ్చాడు, మహేష్ బాబుకి మురుగదాస్ ఇచ్చిన షాక్ అయితే మర్చిపోవడం కూడా కష్టమే. ఆ హీరో ఈ హీరో అని ఎందుకులే గీత గోవిందం లాంటి సూపర్ హిట్ కొట్టిన తర్వాత విజయ్ దేవరకొండకి ఆనంద్ శంకర్ ‘నోటా’ సినిమాతో తెలుగు తమిళ భాషల్లో ఊహించని ఫ్లాప్ ఇచ్చాడు. అలా అని ఆనంద్ శంకర్ వీక్ డైరెక్టర్ కాదు… ‘అరిమ నంబి’, ‘ఇరు మురుగన్’ లాంటి థ్రిల్లర్స్ ని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసాడు. హాలీవుడ్ స్టైల్ ఆ మేకింగ్ ఆనంద్ శంకర్ స్పెషాలిటీ. సో ఎంతటి టాలెంటెడ్ డైరెక్టర్స్ అయినా తెలుగు హీరోలతో చేస్తున్న సమయంలో ఇక్కడ ఫ్లాప్స్ వస్తున్నాయి. ఫ్లాప్ స్ట్రీక్ లో ఉండి… ఎట్టి పరిస్థితిలో హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో విజయ్ దేవరకొండ ఇలాంటి సమయంలో ఈ రిస్క్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు.
