NTV Telugu Site icon

Roshan Kanakala: హేయ్ రోషన్… నువ్వేనా.. ఇలా తయారయ్యావ్ ఏంటి?

Mowgli

Mowgli

Roshan Kanakala Sandeep Raaj People Media Factory’s Film Titled Mowgli: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ రోజు వినాయక చతుర్థి శుభ సందర్భంగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సమకాలీన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుమ-రాజీవ్ కనకాలల కుమారుడు రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రోషన్ కనకాల తన కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ తనదైన చిరునవ్వుతో మెరిసిపోతూ కనిపించాడు. దట్టమైన అడవి మధ్యలో గుర్రంతో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. ఇక మోగ్లీ జంగిల్ బుక్‌లోని ప్రముఖ పాత్ర అని తెలిసిందే.

Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?

ఇక ఈ కొత్త కథ కూడా అటవీ నేపథ్యంలోనే సాగనుంది. ఇక ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా ఆహ్లాదకరంగా ఉండగా రోషన్ కూల్‌గా కనిపిస్తున్నాడు. జాతీయ అవార్డును గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన దర్శకుడు సందీప్ రాజ్, కలర్ ఫోటో తరహాలో భావోద్వేగమైన మరో ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక విలన్‌ పాత్ర ఈ సినిమాలో కీలకం కావడంతో మంచి నటుడిని సెట్ చేసే పనిలో ఉంది టీం. ఇక మోగ్లీ సినిమాకి కాల భైరవ సంగీతాన్ని సమకూర్చనున్నారు. బాహుబలి 1 & 2 మరియు RRR వంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లకు చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ రామ మారుతి M ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. కలర్ ఫోటో, మేజర్ మరియు రాబోయే గూఢచారి 2 వంటి హిట్ చిత్రాలకు ఎడిటర్ అయిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. ఇక మోగ్లీని 2025 వేసవిలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Show comments