Site icon NTV Telugu

“రొమాంటిక్” ట్విట్టర్ టాక్

Romantic Movie Twitter Review

Romantic

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రంతో కేతిక శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ‘రొమాంటిక్’ మూవీ ఈరోజు థియేటర్ లోకి వచ్చింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలాకాలం నిరీక్షణ తర్వాత విడుదలైంది. మూవీ టైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా హీరో హీరోయిన్ ల తో స్పెషల్ ఇంటర్వ్యూ చేయడం సినిమాపై బజ్ పెంచేసింది. సినిమా ప్రివ్యూ షోలకు టాలీవుడ్లోని దిగ్గజ దర్శకులంతా వెళ్లడం, పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రివ్యూస్ అమెరికాలో వేశారు. సినిమా చూసిన ప్రేక్షకులను సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Read Also : “వరుడు కావలెను” ట్విట్టర్ రివ్యూ

మాఫియా నేపథ్యంలోని ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో పూరి మార్క్ కనిపిస్తోందని, ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను రన్ చేశారని, హీరోయిన్ కేతికశర్మను చూడడానికైనా సినిమాకి వెళ్లాల్సిందే అంటున్నారు. ఇక రమ్య కృష్ణ ఎంట్రీ సినిమాకు బూస్ట్ ఇస్తుందని టాక్. మరోవైపు ఆకాష్ పూరి నటన కనిపించలేదని, మొత్తం పూరి మార్క్, హీరోయిన్ మాత్రమే కనిపిస్తోందని అంటున్నారు. ఒక వర్గం ప్రేక్షకులు సినిమా బాగుంది అని కితాబు ఇస్తుంటే, మరో వర్గం ప్రేక్షకులు మాత్రం యావరేజ్ అంటూ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

Exit mobile version