Site icon NTV Telugu

మరింత “రొమాంటిక్”గా బడాస్ ట్రైలర్

Romantic

Romantic

డాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి నటిస్తున్న తాజా చిత్రం “రొమాంటిక్”. ఆకాష్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న “రొమాంటిక్” చిత్రం టీజర్ ను మేకర్స్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది. “రొమాంటిక్” చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచారు. తాజాగా “రొమాంటిక్” బాదాస్ అంటూ మరో ట్రైలర్ ను విడుదల చేశారు.

Read also : స్టార్ హీరోలకు “రాధేశ్యామ్” గుబులు… వెనక్కి తగ్గుతారా ?

ఈ ట్రైలర్ లో సినిమాలోని ముఖ్యమైన డైలాగులతో పాటు ఆసక్తికర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సాగింది. ఇక ఇందులోని సన్నివేశాలు మరింత ‘రొమాంటిక్’గా ఉన్నాయి. అంతేకాదు కథలో క్రైమ్ యాంగిల్ ను కూడా చూపించారు. మక్రంద్ దేశ్‌పాండే ప్రధాన విలన్‌గాకన్పిస్తుండగా, రమ్య కృష్ణ లేడీ పోలీసుగా కనిపించింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version