‘విక్రం’ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన ‘లోకేష్ కనగారాజ్’ తన నెక్స్ట్ సినిమాల గురించి హింట్ ఇచ్చాడు. ఇటివలే జరిగిన ‘ఫిల్మీ కంపానియన్ సౌత్ రౌండ్ టేబుల్ 2022’లో లోకేష్ కనగారాజ్ మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు. కమల్ హాసన్, రాజమౌళి, స్వప్న దత్, పృథ్వీరాజ్ సుకుమారన్, గౌతం వాసుదేవ్ మీనన్ కూడా ఉన్న ఈ ఇంటర్వ్యూలో లోకేష్, ప్రస్తుతం తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ‘విజయ్ 67’ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ అయ్యాక విక్రం 2, ఖైదీ 2 సినిమాలు లూప్ లైన్ లో ఉన్నాయని చెప్పాడు. ‘విక్రం’ సినిమాకే హైలైట్ గా నిలిచిన ‘రోలెక్స్’ పాత్రకి ఒక సెపరేట్ సినిమా ఉంటుంది, అందులో ‘రోలెక్స్’ స్టొరీని చెప్పబోతున్నానని లోకేష్ కనగారాజ్ చెప్పాడు. ‘రోలెక్స్’ పాత్రలో ‘సూర్య’ టెర్రిఫిక్ గా నటించాడు, అలాంటి గ్యాంగ్ స్టర్ కి ఫుల్ లెంగ్త్ సినిమా పడితే సూపర్బ్ గా ఉంటుంది.
‘రోలెక్స్’ స్పెషల్ సినిమా కన్నా ముందే సూర్య ‘ఖైదీ 2’లో మరోసారి ‘రోలెక్స్’గా కనిపించనున్నాడు. లోకేష్ కనగారాజ్ ప్రస్తుతం ‘విజయ్ 67’ సినిమాకి సంబంధించిన ప్రోమో షూట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటివలే లాంచ్ అయిన ఈ మూవీ ప్రోమో షూట్ లో విజయ్ తో పాటు ‘సూర్య’, ‘కమల్’, ‘కార్తీ’లు కూడా పాల్గొన్నారు అనే రూమర్ తమిళనాడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్. నిజానికి ‘విజయ్’ మాత్రమే ప్రోమో షూట్ లో పాల్గొన్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్న మాట. ఈ రెండు మాటల్లో ఏది నిజమనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ‘విక్రం’ సినిమాలో ‘సూర్య’ని చూపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన లోకేష్ కనగారాజ్ ఈసారి ‘దళపతి విజయ్’ని ‘సూర్య’ని ఒకే స్క్రీన్ పై చూపించి షాక్ ఇస్తాడేమో చూడాలి.