RK Sagar: మొగలి రేకులు ఆర్కే నాయుడుకు ఈసారైనా హిట్ అందేనా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Sagar: మొగలిరేకులు సీరియల్ తో ఆర్కే నాయుడుగా మారిపోయాడు సాగర్. తనకు పేరు తెచ్చిన పాత్ర పేరునే ఇంటిపేరుగా మార్చుకొని ఆర్కే సాగర్ గా కొనసాగుతున్నాడు. ఇక మొగలి రేకులు సీరియల్ తరువాత సాగర్ కు ఎన్నో సీరియల్ అవకాశాలు వచ్చాయి. కానీ, తాను హీరోగా వెండితెరపై నిరూపించుకోవాలని అన్ని ఆఫర్స్ ను తిరస్కరించాడు. అలానే సిద్దార్థ్ అనే సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత దిల్ రాజు నిర్మాణంలో షాదీ ముబారక్ అని ఒక సినిమా చేశాడు. ఇది సాగర్ కు మంచి పేరునే తీసుకొచ్చిపెట్టింది. ఇక చాలా గ్యాప్ తరువాత సాగర్ నటిస్తున్న చిత్రం ది 100. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియా ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లో ఆర్కే సాగర్ విక్రాంత్ ఐపీఎస్ గా పరిచయం అయ్యాడు. ఖాకీ దుస్తులు ధరించి, చేతిలో తుపాకీతో కనిపించాడు. స్పోర్టింగ్ షేడ్స్, అతని ముఖంలో ఇంటన్సిటీ ని గమనించవచ్చు. మోషన్ పోస్టర్ నెంబర్ 100 యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. “ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఇది ఒక ఆయుధం” అని చెప్పుకొచ్చారు. మిషా నారంగ్ కథానాయికగా నటిస్తుండగా, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా మొగలి రేకులు ఆర్కే నాయుడు హిట్ అందుకుంటాడా.. ? అనేది చూడాలి.
Also Read
- Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
- Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
- Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
- Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
తాజావార్తలు
-
Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!