RJ Rachana : పాపులర్ రేడియో జాకీ హఠాన్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది సెలెబ్రిటీలను పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈరోజు ప్రముఖ మలయాళ సీనియర్ నటి కేపీఏసీ లలిత అనారోగ్యంతో కన్నుమూశారు. మరోవైపు ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన మంగళవారం గుండెపోటుతో మరణించారు. రచన జెపి నగర్‌లోని తన నివాసంలో ఛాతీ నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రచన చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.
Read Also : KPAC Lalitha : ఇండస్ట్రీలో మరో విషాదం… సీనియర్ నటి కన్నుమూత
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
రేడియో జాకీగా దశాబ్ద కాలం పాటు అనుభవం ఉన్న రచన 2000ల మధ్యలో రేడియో మిర్చి 98.3 ఎఫ్‌ఎమ్‌లో తన హాస్యం, అద్భుతమైన నైపుణ్యంతో ‘పోరి టపోరి రచన’గా ప్రాచుర్యం పొందింది. ఇంతకుముందు వరల్డ్ స్పేస్ శాటిలైట్ రేడియోలో పని చేసిన రచన, ఆ వృత్తిని విడిచి పెట్టే ముందు రేడియో సిటీలో కూడా పని చేసింది. శిక్షణ పొందిన సంగీత విద్వాంసురాలు, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు రచన. ఆమె ఊహించని మరణం రేడియో, టెలివిజన్ పరిశ్రమలను దిగ్భ్రాంతికి గురి చేసింది. రక్షిత్ శెట్టి, శ్వేత శ్రీవాస్తవ్ నటించిన బ్లాక్ బస్టర్ కన్నడ రొమాంటిక్ డ్రామా ‘సింపుల్ ఆగ్ ఒండు లవ్ స్టోరీ’ (2013)లో ఆమె ఓ పాత్రలో నటించింది. రచన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!