బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్”గా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రముఖ రియాలిటీ షో మూడవ వారం ముగింపుకు వచ్చింది. ఆదివారం వీకెండ్ ఎపిసోడ్‌లో షో హోస్ట్ నాగార్జున అక్కినేని ఎవిక్షన్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే మూడో వారంలో ఆర్జే చైతు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. RJ చైతు హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ రేడియో జాకీ. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అయితే చైతు ఇటీవల బిగ్ బాస్ హౌస్‌కి మూడవ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అంతేకాకుండా షో నుండి ఎలిమినేట్ అయిన మూడవ కంటెస్టెంట్‌గా మారాడు.
Read Also : RRR Pre Release Event : తెర వెనుక అంతా నడిపించింది మెగాస్టారేనట !!
RJ చైతు అన్ని టాస్క్‌లలో నిలకడగా రాణిస్తున్నాడు. అంతేకాకుండా హౌజ్ లో అతని వైఖరి, ఇతర హౌస్‌మేట్స్ పట్ల ప్రవర్తన కూడా సానుకూలంగా ఉంది. కెప్టెన్సీ టాస్క్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి కెప్టెన్ బ్యాడ్జ్‌ని కైవసం చేసుకున్నాడు. అయితే ఆయనకు అఖిల్, తేజస్విలతో మరికొందరు కంటెస్టెంట్స్ తో మాత్రం పడట్లేదనే చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఓట్లు తక్కువగా రావడంతో ఆర్జే చైతూను బిగ్ బాస్ బయటకు పంపించేశాడని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఈ విషయం తెలియనుంది.
