NTV Telugu Site icon

Rishab Shetty: రష్మికకి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రిషబ్…

Rishab Shetty Rashmika

Rishab Shetty Rashmika

నేషనల్ క్రష్ రష్మిక, కాంతారా హీరో రిషబ్ శెట్టి మధ్య గొడవ సద్దుమనిగినట్లు లేదు. తన మొదటి ప్రొడక్షన్ హౌజ్ గుర్తు లేదని రష్మిక అనడం, రష్మిక లాంటి హీరోయిన్ తో వర్క్ చెయ్యను అని ఇండైరెక్ట్ గా రిషబ్ శెట్టి చెప్పడం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అయ్యింది. రష్మికని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ బాన్ చేస్తుంది అనే వార్త కూడా వైరల్ అయ్యింది, దీంతో రష్మిక ఇంకా అలాంటిది జరగలేదు, తనని ఎవరూ బ్యాన్ చెయ్యలేదు అని మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత రిషబ్ శెట్టి, రష్మికలు సైలెంట్ అవ్వడంతో ఈ ఇద్దరి మధ్య వివాదం ముగుసిపోయిందని అంతా అనుకున్నారు. అయితే రిషబ్ శెట్టి మాత్రం గతాన్ని మర్చిపోయినట్లు లేదు, మరోసారి నేషనల్ క్రష్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు.

కన్నడ బ్యూటీ రష్మిక నటించిన మొదటి సినిమా ‘కిరాక్ పార్టీ’. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీని రిషబ్ శెట్టి డైరెక్ట్ చేశాడు. కిరాక్ పార్టీ కన్నడలో సూపర్ హిట్ అయ్యింది, ఈ మూవీ షూటింగ్ సమయంలోనే రష్మిక-రక్షిత్ శెట్టిలు ప్రేమలో పడి పెళ్లి వరకూ వెళ్లారు. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో రష్మిక కెరీర్ ఊపందుకుంది. తెలుగులో మంచి మంచి అవకాశాలు వచ్చాయి, ఇక్కడ సినిమాల్లో నటిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ అయిపొయింది. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అందుకుంటున్న తరుణంలో రష్మిక, రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకుంది. ఇక్కడి నుంచే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో రష్మికకి బాడ్ నేమ్ రావడం మొదలయ్యింది.

కిరాక్ పార్టీ సినిమా రిలీజ్ అయ్యి ఆరేళ్ళు అయిన సంధర్భంగా, చిత్ర యూనిట్ అంతా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి కూడా ‘కిరాక్ పార్టీ’ యూనిట్ ని ట్యాగ్ చేసి థాంక్స్ చెప్పాడు కానీ హీరోయిన్ గా నటించిన రష్మికని మాత్రం ట్యాగ్ చెయ్యలేదు. హీరో రక్షిత్ శెట్టి కూడా రష్మికని ట్యాగ్ చెయ్యకుండా కిరాక్ పార్టీ గురించి ట్వీట్ చేశాడు. దర్శకుడు, హీరో మాత్రమేనా? నేను కూడా తక్కువ కాదు అనుకుందో ఏమో కానీ రష్మిక, తన ఇన్స్టా స్టొరీలో “6 years of Kirik Party, where it all started” అంటూ పోస్ట్ చేసింది. ఇందులో హీరోని కానీ డైరెక్టర్ ని కానీ రష్మిక ట్యాగ్ చెయ్యలేదు. మొత్తానికి ఇప్పుడిప్పుడే సైలెంట్ అవుతుందనుకున్న వివాదం, ‘కిరాక్ పార్టీ’ సినిమా ఆరేళ్ళు అయిన సంధర్భంగా మళ్లీ మొదలయ్యేలా ఉంది.