Site icon NTV Telugu

Hanuman: నిన్న భజరంగీ.. నేడు కాంతార.. హనుమాన్ పై కన్నడ నటుల ప్రశంసలు

Rishab

Rishab

Hanuman: హనుమాన్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే రూ. 100 కోట్ల మార్క్ ను దాటిన ఈ సినిమా అన్ని భాషల్లో విజవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇక ప్రశాంత్ వర్మ టేకింగ్ ను ప్రతిఒక్కరు ప్రశంసిస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన విజువల్స్ ను అందించిన అతని పనితనానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.. నిన్న హనుమాన్ సినిమా వీక్షించి చిత్ర బృందాన్ని మెచ్చుకున్న విషయం తెల్సిందే.

తాజాగా మరో కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి సైతం.. హనుమాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాంతార సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్.. హనుమాన్ గురించి ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ” హనుమాన్ ను ప్రశంసించే జాబితాలో నేను కూడా చేరాను. ప్రశాంత్ వర్మ కథ చెప్పడం మరియు చిత్ర నిర్మాణంలో విజయం సాధించాడు. చాలాకాలం తేజ సజ్జా నీ నటన గుర్తుండిపోతుంది” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version