Site icon NTV Telugu

Richa Gangopadhyay: ‘మిర్చి’ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..

Richa

Richa

రానా దగ్గుబాటి ఫస్ట్ మూవీ ‘లీడర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రిచా గంగోపాధ్యాయ. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోక పోయినా రిచాకు మాత్రం మంచి అవకాశాలను అందించింది. ‘మిరపకాయ్’, ‘మిర్చి’, ‘నాగవల్లి’, ‘భాయ్’, ‘సారొచ్చారు’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉండగానే తన స్నేహితుడు  జో  లాంగెల్లా తో ప్రేమలో పడి, ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇక గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం విదితమే.. ఆ బిడ్డకు లూకా  షాన్  లాంగెల్లా అనే పేరు పెట్టి.. చిన్నారి  ఆలనా పాలనా చూస్తూ ఇంటికే పరిమితమైంది.

ఇక తాజాగా  రిచా లేటెస్ట్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఒక ఫంక్షన్ లో భర్త, బిడ్డతో కలిసి ఇదుగో ఇలా దర్శనమిచ్చింది. నీలం రంగు లంగావోణీలో రిచా ఎంతో అందంగా కనిపించింది.  పెళ్లి తరువాత  రిచాలో చాలా మార్పొచ్చింది. కొద్దిగా బొద్దుగా మారింది. చూడగానే రిచా అని గుర్తుపట్టడం కష్టం అనేలా  ఉంది. అయితే  తల్లిగా మారిన తరువాత ఆడవారిలో మార్పు రావడం సహజం.. ఇప్పటికి రిచా ఎంతో అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొడుకు పెద్దవాడు అయ్యాక అమ్మడు రీ ఎంట్రీ ఏమైనా ప్లాన్ చేస్తుందేమో చూడాలి.

Exit mobile version