సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ అందాన్ని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటారు కూడా. ముఖ్యంగా హీరోయిన్లు, యాంకర్ల పై ఆయన కురిపించే ప్రశంసలు, పొగడ్తల వర్షాన్ని ఆపడం ఎవరితరం కాదు. తాజాగా క్యూట్ బ్యూటీ మేఘ ఆకాష్ విషయంలో కూడా అదే జరిగింది. మేఘ ఆకాష్ ను ఆర్జీవీ తన పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. 40 ఏళ్ళ క్రితం ఇలాంటి అమ్మాయి తనకు దొరికితే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. అసలు డివోర్స్ తీసుకునే వాడినే కాదు. కానీ మేఘాతో ఒక ప్రాబ్లెమ్ ఉందని, ఆమె చాలా స్వీట్ గా ఉంటుందని, ఆమెతో మాట్లాడితే డయాబెటిస్ వస్తుందేమోనని అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
Read Also : “రాధేశ్యామ్” అప్డేట్… ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ మొర ఆలకించారా ?
ఇదంతా నిన్న జరిగిన “డియర్ మేఘ” ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్మ ఇంకా మాట్లాడుతో హీరోతో పాటు చిత్రబృందానికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సినిమాలో అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ హీరోహీరోన్లుగా నటించారు. ఈ బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ లో అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన “దియా” అనే సినిమాని తెలుగులో “డియర్ మేఘ” పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందిం రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో బుల్లితెర బ్యూటీలతో చిందిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. అందులో బిగ్ బాస్ బ్యూటీలు అరియనా, అషు రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు.