Site icon NTV Telugu

RGV : కుక్కలనే పెళ్లి చేసుకోండి.. డాగ్ లవర్స్ కు ఆర్జీవీ కౌంటర్

Rgv

Rgv

RGV : సుప్రీంకోర్టు తీర్పుతో డాగ్ లవర్స్ అందరూ సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు. ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హీరోయిన్ జాన్వీకపూర్, సదా లాంటి వారు ఏడుస్తూ వీడియోలు పెట్టేస్తున్నారు. వారికి నెటిజన్లు దిమ్మతిరిగే కామెంట్లతో కౌంటర్లు ఇస్తున్నా.. అవి సరిపోవు అని నేరుగా ఆర్జీవీ రంగంలోకి దిగిపోయాడు. డాగ్ లవర్స్ కు వరుస కౌంటర్లు వేసేస్తున్నాడు. తాజాగా కుక్కల గురించి బాధపడుతున్న డాగ్ లవర్స్ పై బాంబు పేల్చాడు. మీరు అంతగా కుక్కల ప్రేమికులు అయిచతే.. వీధుల్లో ఉన్న నిరుపేదలను మీ ఇంట్లో పెంచుకుని కుక్కలను వీధులను వదిలేయొచ్చు కదా అంటూ ఝలక్ ఇచ్చాడు.

Read Also : Mahesh Babu : మహేశ్ బాబు మూవీకి అలా చేస్తే ఓపెనింగ్స్ రావన్నారు.. నిర్మాత కామెంట్స్

అక్కడితో ఆగిపోలేదు.. మీరు కుక్కలను మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారు కదా. మరి అదే కుక్కలను పెళ్లి చేసుకోండి. మనుషులను ఎందుకు చేసుకుంటున్నారు. మీకు ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ కు వెళ్లకండి. వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్లండి. మీ ఇంట్లో పెంచుకుంటున్న బ్రీడ్ కుక్కలను కూడా వీధుల్లో వదిలేయండి. అవి కూడా ఎలా బతుకుతాయో మీకు తెలుస్తుంది. మీ పిల్లలను వీధి కుక్కలతో ఆడుకోవడానికి పంపించండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. కుక్కలకు కూడా పిల్లలతో సమానంగా హక్కులు ఉంటాయంటున్నారు కదా. మరి కుక్కలకు కూడా స్కూళ్లు, హాస్పిటల్స్ కట్టించండి. మీ పిల్లలకు బోన్లు రెడీ చేయండి. వీధి కుక్కలు మురికి వాడల్లో నివసించే వారినే కరుస్తున్నాయి కాబట్టి వారిని మీ ఇంట్లో పెట్టుకోండి. దేవుడి స్థానంలో కుక్కలను పూజించండి అంటూ సెటైర్లు వేశారు ఆర్జీవీ.

Read Also : Illegal Affair : అడ్డొస్తే రక్తపాతమే.. అక్రమ సంబంధాల నెత్తుటి కథలు..

Exit mobile version