Site icon NTV Telugu

RGV: బాహుబలి లెవెల్ సూపర్, మెగా బెగ్గింగ్.. జగన్‌నూ వదలని ఆర్జీవీ

rgv

వివాదాస్పద దర్శకుడు వర్మ మళ్ళీ నిద్ర లేచాడు. నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల భేటీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచాడు వర్మ. భేటీలో పాల్గొన్న ఏ ఒక్క సెలెబ్రిటీనీ వదలకుండా అందరిపైనా సెటైర్లు వేస్తున్నారు. నిన్న రాత్రి మెగా బెగ్గింగ్ అంటూ చిరంజీవిని మాత్రమే టార్గెట్ టార్గెట్ చేసిన వర్మ… ఒక్కడినే టార్గెట్ చేస్తే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో మరి… ఆ ట్వీట్ ను డిలీట్ చేసి ఇప్పుడు తాజాగా మరోమారు అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ట్వీట్ చేశాడు. సీఎం జగన్ నూ వదలకపోవడం గమనార్హం.

Read Also : RGV: మెగా బెగ్గింగ్‌తో హర్ట్ అయ్యా.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై సెటైర్లు

“సర్ చిరంజీవి గారు, నేను మెగా అభిమానిగా మీ మెగా బెగ్గింగ్‌తో మెగా హర్ట్ అయ్యాను” అంటూ ట్వీట్ చేసిన ఆర్జీవీ… దానిని డిలీట్ చేసి తాజాగా “సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఇది జరిగినప్పటికీ, ఒమేగా స్టార్ వారిని ఆశీర్వదించినందుకు నేను సంతోషిస్తున్నాను. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి వైఎస్ జగన్ ను నేను ఎంతో అభినందిస్తున్నాను” అంటూ సెటైరికల్ ట్వీట్ వేశాడు.

ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి కష్టాల్లో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని ముకుళిత హస్తాలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను అభ్యర్థించారని, మెగాస్టార్ తన మెగా స్థానాన్ని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని, తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని మెగా అభిమానులు చాలా మంది గర్వపడుతున్నారు. మరోవైపు వర్మ తన సెటైర్లతో ఎప్పటిలాగే మెగా ఫ్యాన్స్ కు చిర్రెత్తిస్తున్నాడు.

Exit mobile version