Site icon NTV Telugu

బ్రేకింగ్ న్యూస్: దర్శకుడు రాంగోపాల్ వర్మ కిడ్నాప్..

ramgopal-varma

ramgopal varma

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు. ఇప్పటికే టీడీపీ ని , మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ పై అవసరానికి మించి విరుచుకుపడే ఈ డైరెక్టర్ మరోసారి వీరందరిని తన సినిమాలో ఇరికించాడు. అప్పుడెప్పుడో ఆర్జీవీ మిస్సింగ్ అనే చిత్రంతో తెరపైకి వచ్చిన వర్మ ఇప్పుడు ఆ చిత్రానికి ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఇటీవల అమ్మాయి, డేంజరస్ అంటూ కుర్ర హీరోయిన్ల అందాలను ఎరగా వేసి సినిమాలను తీస్తున్న వర్మ.. ఇక తాజాగా రాజకీయాలను స్టార్ట్ చేశాడు. ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ రేపు ఉదయం 9.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు.

” హే పవర్ స్టార్.. ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ రేపు ఉదయం 9.30 గంటలకు విడుదల అవుతుంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కిడ్నాప్ అయ్యాడు.. మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, అతడి కొడుకుపై అనుమానం ఉంది అని చెప్పుకొచ్చాడు. న్క ఇందులో పవన్ కళ్యాణ్, చిరంజీవి పేర్లను తప్పుగా ట్యాగ్ చేసి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ పేర్లను మాత్రం కరెక్ట్ గా ట్యాగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఈ సినిమాకు అధిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా కెవి ఛటర్జీ నిర్మిస్తున్నారు. మరి ఈ ట్రైలర్ లో వర్మ ఎలాంటి వివాదాన్ని సృష్టిస్తాడో చూడాలి.

Exit mobile version