Site icon NTV Telugu

AHA: ‘రేయికి వేయి కళ్ళు’ అంటున్న అరుళ్‌నిధి స్టాలిన్

Arul Nidhi Stalin

Arul Nidhi Stalin

AHA New Movie: ‘రేయికి వేయి కళ్ళు’ అంటున్న అరుళ్‌నిధి స్టాలిన్’డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ’ వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు అరుళ్‌నిధి స్టాలిన్. అతను నటించిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ కూడా తమిళంలో చక్కటి విజయాన్ని సాధించింది. ఊహకందని ట్విస్టులతో సాగే ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుని అర్థశతదినోత్సవం జరుపుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులో ‘రేయికి వేయి కళ్ళు’ పేరుతో డబ్ అయ్యింది. దీనిని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ నెల 30న స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

Read Also: Kajal Aggarwal: రీఎంట్రీలో ఐటమ్‌కు రెడీ అంటున్న కాజల్..?

ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ”దీనికి స్క్రీన్ ప్లే ప్రధానబలం. రివర్స్ ఆర్డర్‌ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. ఒక్కోసారి ఈ సినిమాను చూస్తుంటే.. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘మోమెంటో’ సినిమా గుర్తుకు వస్తుంటుంది. డైరెక్టర్ ము. మారన్ ఒక్కో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా కథ, కథనాలు పకడ్బందీగా రాసుకున్నారు. ఈ మూవీ కథ అంతా కూడా ఒక సీరియల్ మర్డర్స్ నేపథ్యంలో జరుగుతుంది. తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే క్యాబ్ డ్రైవర్ భరత్ (అరుళ్‌నిధి), డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ (అజ్మల్) మధ్యే ఈ కథ తిరుగుతుంది. చివరి వరకు హంతకుడు ఎవరు అన్నది ప్రేక్షకులు ఊహించలేరు, అంచనా వేయలేరు. అదే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ” అని తెలిపారు. తమిళంలో ‘రాక్షసన్’ సినిమాను నిర్మించిన యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, డిల్లీ బాబులు ‘రేయికి వేయి కళ్లు’ చిత్రాన్ని నిర్మించారు. శామ్ సీఎస్ నేపథ్య సంగీతం సమకూర్చగా, అరవింద్ సింగ్ సినిమాటోగ్రఫీగా, శాన్ లోకేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ఈ సినిమాలు తెలుగు వ్యూవర్స్ సైతం ఆదరిస్తారనే ఆశాభావాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. మహిమా నంబియార్, విద్య ప్రదీప్, ఛాయాసింగ్, ఆనంద్ రాజ్, జాన్ విజయ్, ‘ఆడుకాలమ్’ నరేన్ తదితరులు ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version