Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rewind 2022 New Heroines Who Entertained This Year

Rewind 2022: ఈ ఏడాది కుర్రాళ్లను గిలిగింతలు పెట్టిన కొత్త హీరోయిన్లు

Published Date :December 18, 2022 , 11:04 pm
By Omprakash Vaddi
Rewind 2022: ఈ ఏడాది కుర్రాళ్లను గిలిగింతలు పెట్టిన కొత్త హీరోయిన్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rewind 2022: కొత్త నీరు వచ్చి పాత నీటిని తోసేస్తుంటుంది. చిత్రసీమలో హీరోయిన్ల విషయంలో అదే జరుగుతూ ఉంటుంది. ప్రతి యేడాది వివిధ భాషల నుండి నూతన నాయికలు వస్తుంటారు. పాత కథానాయికలు నిదానంగా ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. ఆ రకంగా చూసినప్పుడు ఈ యేడాది సీనియర్ హీరోయిన్స్ కంటే.. కొత్తగా వచ్చిన వారే తెలుగు చిత్రసీమలో హంగామా సృష్టించారు. ఈ యేడాది ప్రారంభంలోనే వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ మూవీతో ఫర్నాజ్ శెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దిశ ఇన్సిడెంట్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఆశ’తో సోనియా ఆకుల తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ నటించిన ‘వర్జిన్ స్టోరీతో ఏకంగా ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు సౌమికా పాండియన్, రిషికా ఖన్నా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

కొత్త కథానాయికలలో ఈ యేడాది వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్న భామ ఎవరైనా ఉన్నారంటే.. అది మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కీలక పాత్రలు పోషించిన ‘భీమ్లా నాయక్’లో సంయుక్త రానా భార్యగా నటించింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు భాషలో మాట్లాడి, అందరి మనసుల్నీ ఆకట్టుకుంది. విశేషం ఏమంటే ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ధనుష్‌ తో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్’లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు.. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాలోనూ సంయుక్త ఛాన్స్ దక్కించుకుంది.

రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్.’ తోనూ ఇద్దరు నాయికలు తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. అందులో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ కాగా, మరొకరు విదేశీ నటి ఒలీవియా. విక్టరీ వెంకటేశ్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వగా విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ చిత్రంతోనూ మిధిలా పాల్కర్, ఆశాభట్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సారి మలయాళీ ముద్దుగుమ్మలే ఎక్కువగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సీనియర్ నటుడు రాజశేఖర్ టైటిల్ రోల్ పోషించిన ‘శేఖర్’ మూవీని జీవిత డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ద్వారా మలయాళీ నటి ఆత్మీయ రాజన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలానే తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటికే పలు చిత్రాలలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ భార్య నజ్రిమా నజీమ్ ‘అంటే సుందరానికి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఒకే యేడాది రెండు సినిమాలలో నటించిన ఘనతను సాయీ మంజ్రేకర్ అందుకుంది. మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటించిన ‘గని’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయీ. ‘గనీ’ ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ ఆమె నటించిన రెండో తెలుగు సినిమా ‘మేజర్’ చక్కని విజయం సాధించింది, దాంతో ఈ అందాలభామకు మంచి గుర్తింపు లభించింది.

ఈ యేడాది నటిగా మంచి మార్కులు పొందిన నూతన కథానాయికల జాబితాలో ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా నిలుస్తుంది. ఆమెలానే ఉత్తరాది నుండి దక్షిణాదిన అదృష్టం పరీక్షించుకున్న వారిలో చుంకీ పాండే కూతురు అనన్యా పాండే కూడా ఉంది. ఈమె విజయ్ దేవరకొండ ‘లైగర్’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తమిళ, మలయాళ చిత్రాలలో నటించిన ఐశ్వర్య లక్ష్మీ ‘గాడ్సే’ సినిమాతో పాటు ‘అమ్ము’లోనూ నటించింది. మొదటిది ధియేటర్లలో విడుదల కాగా, రెండో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. యానీ శీతల్ (కిన్నెరసాని), రజిషా విజయన్ (రామారావు ఆన్ డ్యూటీ), మానస రాధాకృష్ణన్ (హై వే), రితికా నాయక్ (అశోక వనంలో అర్జున కళ్యాణం), సంచిత బసు (ఫస్ట్ డే ఫస్ట్ షో), విర్తి వఘానీ (కొత్తకొత్తగా), సంజనా ఆనంద్ (నేను మీకు బాగా కావాల్సిన వాడిని), షిర్లే సేటియా (కృష్ణ వ్రింద విహారి), కయదు లోహర్ (అల్లూరి), సౌమ్య మీనన్ (లెహరాయి), కావ్యాశెట్టి (గుర్తుందా శీతాకాలం) తదితరులు తెలుగువారికి పరిచయం అయ్యారు. ఒకనాటి బాలనటి కావ్య కళ్యాణ్‌ రామ్ ‘మసూద’లో హీరోయిన్ గా నటించింది, ‘దిల్’ రాజు బ్యానర్ నుండి రాబోతున్న ‘బలగం’లోనూ నాయికగా నటిస్తోంది. తొలి చిత్రం ‘ఐరావతం’ మూవీలోనే తన్వీ నాగి ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీర్నా మీనన్.. ‘అల్లరి’ నరేశ్‌ ‘ఉగ్రం’లోనూ నాయికగా నటిస్తోంది. ‘నా వెంట పడుతున్న చిన్నవాడెవరమ్మా’ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన అఖిల ఆకర్షణ ‘ఏపీ 04 రామాపురం’లోనూ నటించింది. ఇలా ఈ యేడాది చాలామంది హీరోయిన్లు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు కానీ అందులో అదృష్టం కొందరినే వరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • new heroines
  • Rewind 2022
  • tollywood new heroines
  • Tollywood News

తాజావార్తలు

  • Samrat Choudhary: బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి బెదిరింపులు.. ఒకరు అరెస్ట్

  • Cuba vs United States: మళ్లీ క్యూబాపై ట్రంప్ ఫోకస్..! ఆ దేశ సైన్యం ఎంత బలంగా ఉంది..? అమెరికా ముందు నిలబడగలదా..?

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • Prahlad Joshi: 30 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ సేక‌రించండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి సూచన

  • Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

ట్రెండింగ్‌

  • How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions