Revu Party: “రేవు”పార్టీలో హేమాహేమీలు.. ఆర్జీవి మురళీమోహన్ సహా?
- "రేవు" పార్టీలో హేమా హేమీలు
- త్వరలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న "రేవు" మూవీ
- రేవు సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్ విషయాలు వింటున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revu Party: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రేవు”. ఈ చిత్రంలో గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి నిర్మిస్తున్నారు. నవీన్ పారుపల్లి సమర్పకులుగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “రేవు” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ఫ్యాషన్ షో మరియు స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో చిత్ర బృందంతో పాటు మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల, సంపత్ నంది, ఉత్తేజ్ గెస్టులుగా పాల్గొని సందడి చేశారు.
Also Read; The Goat : విజయ్ ‘ది గోట్ ‘ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
మురళీ మోహన్ మాట్లాడుతూ.. రేవుల దగ్గర జీవనం గడిపే మత్య్సకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు వారి శ్రమను దోచుకుంటారు. చేపలను వారు చెప్పిన రేటుకే కొనాలని షరతులు విధిస్తారు. మత్స్యకారుల జీవితాల్లోని ఇలాంటి ఇబ్బందులను నేపథ్యంగా ఎంచుకుని రేవు సినిమా చేయడం మంచి ప్రయత్నం. ప్రభు నాకు ఈ సినిమాను అంతా కొత్తవాళ్లు చేస్తున్నారు, బాగా చేశారని చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించిందిని రేవు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జీవీ మాట్లాడుతూ.. నేను విజయవాడలో ఉన్నప్పుడు మచిలీపట్నం రేవుకు వెళ్లేవాడిని. అయితే అక్కడ మత్స్యకారుల బాధలు చూసేందుకు కాదు అక్కడ చేపలు అమ్మే వారిని చూసేందుకు. రేవు సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను చూసిన ఈ సినిమా కంటెంట్ ప్రకారం రేవు నేపథ్యంగా సాగే మత్స్యకారుల జీవితాలు, వారి లైఫ్ లో జరిగే ఈవెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారని అనుకుంటున్నాను. రేవు నేపథ్యంగా కంప్లీట్ గా ఒక సినిమా వచ్చినట్లు నాకు గుర్తులేదు. ఈ సినిమాకు సంబంధించి అదొక యూనిక్ పాయింట్ గా చెప్పొచ్చు. దర్శకుడు హరినాథ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. రేవు సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్ విషయాలు వింటున్నా. ఈరోజు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రేవు సినిమా పార్టీ చేసుకోవడం, ఈ ఈవెంట్ లో నేను పాల్గొనడం సంతోషంగా ఉంది. రేవు సినిమా ఘన విజయం సాధించాలి, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు. సంపత్ నంది మట్లాడుతూ.. నిర్మాత డాక్టర్ మురళి గింజుపల్లి నాకు క్లాస్ మేట్. ఆయన నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది. రేవు సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!